బాలయ్య ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు.. విజయశాంతి

Published : Apr 09, 2019, 02:51 PM IST
బాలయ్య ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు.. విజయశాంతి

సారాంశం

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏం మాట్లాడతారో ఆయనకే సరిగా తెలీదంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి.  ఇటీవల విజయశాంతి ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడారు.  ఈ క్రమంలో ఆమె బాలయ్య పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

‘ఎన్టీఆర్’ బయోపిక్, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలు చూశారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నించారు. కాగా.. దీనికి సమాధానంగా.. ఎన్నికల సమయం కాబట్టి బిజీగా ఉన్నానని చూడలేకపోయానని చెప్పారు. 

అనంతరం  ‘‘సినీ స్టార్లు రాజకీయాల్లోకి రావల్సిన అవసరం లేదు, అమితాబ్, చిరంజీవీలు వచ్చి ఏం చేశారు? మేం వేరు, మా బ్రీడ్ వేరు, మా బ్లాడ్ వేరు.. కాబట్టే మేము రాజకీయల్లో రాణిస్తున్నాం అని బాలకృష్ణ అంటున్నారు. దీన్ని ఏ రకంగా చూడాల్సి ఉంటుంది?’’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు విజయశాంతి బదులిస్తూ.. ‘‘ఇది అర్థం పర్థంలేని స్టేట్‌మెంట్‌లా ఉంది. చిన్న పిల్లలు మాట్లాడినట్లుగా ఉంది. తాను ఏ ఉద్దేశంతో అంటున్నాడో.. ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కానప్పుడు.. మాకేం అర్థమవుతుంది? నాకైతే చిన్నపిల్లాడు మాట్లాడినట్లే అనిపిస్తోంది’’ అని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?