ఏపీలో జగన్ దే విజయం, చంద్రబాబు దారుణ ఓటమి : అసదుద్దీన్ ఓవైసీ

By Nagaraju penumalaFirst Published Apr 9, 2019, 4:18 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 130 స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే 21 పార్లమెంట్ స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే తెలంగాణలో టీఆర్ఎస్ 16 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. ఇకపోతే ఏపీ ఎణ్నికల్లో చంద్రబాబుకు దారుణ ఓటమి తప్పదని హెచ్చరించారు. 

హైదరాబాద్‌: రాబోయే ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించడం ఖాయమన్నారు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 130 స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

అలాగే 21 పార్లమెంట్ స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే తెలంగాణలో టీఆర్ఎస్ 16 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. ఇకపోతే ఏపీ ఎణ్నికల్లో చంద్రబాబుకు దారుణ ఓటమి తప్పదని హెచ్చరించారు. 

పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు. మరోవైపు బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్ ఓవైసీ. మహిళా సంరక్షణ బీజేపీతోనే అని చెప్పడం అబద్దమన్నారు. 

జేఎన్‌యూలో మహిళలపై ఏబీవీపీ దాడులు చేసి రెండేళ్లు గడిచిన బీజేపీ ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోలేదని నిలదీశారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని గత ఎన్నికల్లో ప్రకటించిన బీజేపీ ఎందుకు రద్దు చెయ్యలేదని ప్రశ్నించారు. 

రాజ్యాంగం నుంచి ఆర్టికల్ 370ని తొలగించలేరన్నారు. యూనిఫార్మ్ సివిల్ కోడ్ తెస్తామని చెప్పిన బీజేపీకి లా కమిషన్ మెుట్టికాయలు వేసిందన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక మాబ్‌ లించింగ్స్‌ ఎక్కువగా పెరిగాయని తెలిపారు. 

హిందుస్తాన్‌లో భిన్నత్వాన్ని బీజేపీ ఒప్పుకోవడంలేదని తెలిపారు. 2014లో బీజేపీ ప్రకటించిన అచ్చేదిన్‌ ఏమైందన్నారు. నోట్లరద్దు పూర్తిగా ఫెయిల్ అయ్యిందన్నారు. తెలంగాణ ప్రజలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే దాన్ని మోదీ పక్కన పెట్టేశారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.  

అగ్రవర్ణలకు పదిశాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని స్పష్టం చేశారు. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాలేనని స్పష్టం చేశారు అసదుద్దీన్ ఓవైసీ. 

click me!