ప్రేమకు హద్దుల్లేవ్..ప్రణయ్ కు న్యాయం జరగాలి: రాంచరణ్

By rajesh yFirst Published Sep 18, 2018, 7:37 PM IST
Highlights

 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్యపై సినీహీరో రామ్‌చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొండంత ఆశలతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన ప్రణయ్‌ను అన్యాయంగా చంపడం దారుణమని పేర్కొన్నారు. ఈ పరువు హత్య నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఒకరి ప్రాణం తీయడంలో పరువు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. 

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్యపై సినీహీరో రామ్‌చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొండంత ఆశలతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన ప్రణయ్‌ను అన్యాయంగా చంపడం దారుణమని పేర్కొన్నారు. ఈ పరువు హత్య నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఒకరి ప్రాణం తీయడంలో పరువు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. 

సమాజం పేరుతో మనం ఎక్కడికి వెళ్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాంచరణ్. అమృత వర్షిణికి, ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాని చరణ్ పోస్ట్ చేశారు. ప్రేమకు హద్దులు లేవు, ప్రణయ్‌కు న్యాయం జరగాలి (‘జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌’)’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జత చేశారు.

Via fb pic.twitter.com/ei0FUx7tLI

— Ramu Charan (@ramucharan143)

ఫేస్‌బుక్‌లో జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌ హ్యాష్‌ట్యాగ్‌తో ఇప్పటికే ఉద్యమం ప్రారంభమైంది. అమృత వర్షిణి ఈ ఫేస్‌బుక్‌ పేజీని ప్రారంభించారు. ప్రణయ్‌ ఇప్పుడు ఒంటరి కాదు. నాతోపాటు కోట్ల మంది గుండెల్లో బతికే ఉన్నాడు అంటూ తొలి పోస్ట్ చేశారు అమృత వర్షిణి.
 
ప్రణయ్, అమృత వర్షిణిల వివాహం ఇష్టం లేని ఆమె తండ్రి మారుతీరావు ఈనెల 14న మిర్యాలగూడలో సుఫారీ గ్యాంగ్ తో అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు. తమ కుమార్తె తక్కువ కులానికి చెందిన ప్రణయ్‌ ని వివాహం చేసుకుందని పగబట్టిన తండ్రి అల్లుడిని అత్యంత కిరాతకంగా అంతమెుందించాడు. 

ఫోన్లో మాట్లాడుతూ నమ్మించి తన కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. కత్తితో నరికిన సుభాష్ శర్మ, అమృత తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్ తోపాటు మెుత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.  

ఈ వార్తలు కూడా చదవండి

వాళ్లు మారకపోతే 'జి' లో కొట్టి జైలుకి పోదాం.. మంచు మనోజ్ వివాదాస్పద వ్యాఖ్యలు!

ప్రణయ్ హత్య.. కులాన్ని ఈ దేశం నుంచి తీసెయ్యలేరు: గాయని చిన్మయి
ప్రణయ్ హత్యపై హీరో రామ్ కామెంట్!

click me!