టీఆర్ఎస్ టికెట్ రాకుంటే ప్రాణత్యాగమే...ఆ మంత్రి వల్లే పెండింగ్ : శంకరమ్మ

By Arun Kumar PFirst Published Sep 18, 2018, 5:55 PM IST
Highlights

తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. గడువుకు ముందే టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్దమయ్యింది. అన్ని పార్టీల కంటే ముందుగానే 105 మంది అభ్యర్థులను ప్రకటించి  కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే పెండింగ్ లో పెట్టిన మిగతా స్థానాలపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో ఆ స్ధానాల్లో టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల్లో రోజురోజుకు ఆందోళన పెరుగుతోంది. కొందరు పార్టీపై తమ అసంతృప్తిని బహిరంగాగానే వెల్లగక్కుతున్నారు. 

వరంగల్ తూర్పు నియోజకర్గ టికెట్ ను పెండింగ్ లో పెట్టడంతో కొండా దంపతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గంపై రచ్చ కొనసాగుతోంది. ఆ స్థానం నుండి 2014 లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి, నియోజకవర్గ ఇంచార్జి శంకరమ్మ మరోసారి పోటీకి సిద్దమయ్యారు. అయితే ఇక్కడినుండి ఎవరిని పోటీకి నిలపాలన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో తనకు  సీటు రాదేమోనని భావిస్తున్న కాసోజు శంకరమ్మ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

హుజూరాబాద్ లో వర్తక సంఘాల ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో శంకరమ్మ పాల్గొని ప్రసంగించారు. తనకు టికెట్ రాకుండా మంత్రి జగదీశ్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు. తనను హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించకుంటే మంత్రి ఇంటిముందు ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. అంతే కాదు తన కొడుకు మాదిరిగా ప్రాణత్యాగానికి సిద్దమేనని శంకరమ్మ హెచ్చరించారు. టీఆర్ఎస్ జెండా మోయని నాయకులకు టికెట్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. త్వరలోనే ఓ బహిరంగ సభ నిర్వహించి తన బలమేంటో చూపిస్తానని శంకరమ్మ పేర్కొన్నారు.

click me!