అనుచరులతో ఎల్. రమణ భేటీ: రెండు రోజుల్లో టీఆర్ఎస్‌లోకి?

By narsimha lode  |  First Published Jun 13, 2021, 2:19 PM IST

మాజీ మంత్రి , టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ జగిత్యాలలో పార్టీ కార్యకర్తలతో ఆదివారం నాడు సమావేశమయ్యారు. టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. 


కరీంనగర్: మాజీ మంత్రి , టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ జగిత్యాలలో పార్టీ కార్యకర్తలతో ఆదివారం నాడు సమావేశమయ్యారు. టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. కరీంనగర్ జిల్లాలో బీసీ నేతగా ఉన్న ఈటల రాజేందర్  టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నారు.  దీంతో  ఎల్. రమణకు టీఆర్ఎస్ గాలం వేసింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్  రమణతో చర్చించారు. ఎల్. రమణతో బీజేపీ నేతలు కూడ టచ్‌లో ఉన్నారు. అయితే టీఆర్ఎస్ లో చేరితే ఎల్. రమణకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెడతామని ఆ పార్టీ నాయకత్వం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 

also read:చంద్రబాబు భారీ షాక్: టీఆర్ఎస్ లోకి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ

Latest Videos

undefined

రెండు రోజుల్లో ఎల్. రమణ టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరుతారని  చెబుతున్నారు.  ఈ విషయమై అనుచరులతో రమణ చర్చిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రమణ పనిచేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా దెబ్బతింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు టీఆర్ఎస్ , బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరారు.

రెండు రోజుల తర్వాత రమణ టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. బీజేపీ నేతలు కూడ పార్టీలో చేరాలని ఆయనకు ఆహ్వానాలు పంపుతున్నారు. గతంలో కూడ ఎల్. రమణకు టీఆర్ఎస్ నుండి ఆహ్వానాలు అందాయి. కానీ ఆయన టీడీపీని వీడలేదు. కానీ, ఈ దఫా ఆయన కారెక్కాలని భావిస్తున్నారని సమాచారం.

click me!