బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధిగా వద్దిరాజు రవిచంద్ర .. మరోసారి ఛాన్స్ ఇచ్చిన కేసీఆర్

రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్ధిగా వద్దిరాజు రవిచంద్రను ఖరారు చేశారు. తెలంగాణ నుంచి ముగ్గురు సభ్యుల పదవీకాలం ముగియనుండటంతో కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌లు రాజ్యసభ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.


రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్ధిగా వద్దిరాజు రవిచంద్రను ఖరారు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్ధిత్వానికి ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఆయన 20 నెలల పాటు కొనసాగారు. 2022 మే 30న తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు రవిచంద్ర. ఆయన పదవీ కాలం ఏప్రిల్ 2న ముగియనుంది. తెలంగాణ నుంచి ముగ్గురు సభ్యుల పదవీకాలం ముగియనుండటంతో కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌లు రాజ్యసభ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 

2018లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన గాయత్రి రవి ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు గాయత్రి రవి సమీప బంధువు. గాయత్రి రవి 1964, మార్చి 22న మ‌హ‌బూబాబాద్ జిల్లా కేస‌ముద్రం మండ‌లం ఇనుగుర్తి గ్రామంలో జ‌న్మించారు. ఈయ‌న‌కు భార్య విజ‌య‌ల‌క్ష్మి, కూతురు గంగా భ‌వాని, కుమారుడు సాయి నిఖిల్ చంద్ర ఉన్నారు. గ్రానైట్ వ్యాపారిగా ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు వుంది. 

Latest Videos

తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షులుగా ...  తెలంగాణ మున్నూరు కాపు ఆల్ అసోసియేష‌న్ జేఏసీ గౌర‌వ అధ్య‌క్షులుగా వ్యవహరిస్తున్నారు. స్వగ్రామంలో బ‌డులు, గుడులు, ర‌హ‌దారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ సౌక‌ర్యాల‌ను క‌ల్పించి.. దాతగానూ చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. 

మేడారం సమ్మక్క సారక్క ఆల‌య అభివృద్ధికి త‌న వంతు ఆర్థిక సాయం చేశారు. 2016 లో జ‌రిగిన జాత‌ర సంద‌ర్భంగా రూ. 3.5 కోట్లు వెచ్చించి అమ్మ‌వార్ల గ‌ద్దెలు, క్యూలైన్ల‌కు గ్రానైట్ రాళ్లు, స్టీల్ రెయిలింగ్‌తో ఆధునీక‌రించారు. 2018లో సుమారు రూ. 20 ల‌క్ష‌లు వెచ్చించి మ‌రికొన్ని క్యూలైన్ల‌ను ఆధునీక‌రించారు. వివిధ ప్రాంతాల నుంచి 122 ర‌కాల పూల‌ను తీసుకొచ్చి అమ్మ‌వారి గ‌ద్దెల చుట్టూ అలంక‌రించారు.

ఖ‌మ్మం గ్రానైట్ ప‌రిశ్ర‌మ‌కు గాయ‌త్రి ర‌వి క్వారీలే జీవ‌నాధారం అని చెప్పొచ్చు. అక్కడ సుమారు 500 స్లాబ్ ఫ్యాక్ట‌రీలు, వాటిలో 2000 క‌ట్ట‌ర్లు, 150 టైల్స్ ఫ్యాక్ట‌రీలు, మ‌రో 10 ఎక్స్‌పోర్ట్ యూనిట్‌లు వున్నాయి. వీటిపై ఆధారపడి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా సుమారు ల‌క్ష మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఈ ప‌రిశ్ర‌మ‌లకు 60 నుంచి 70 శాతం ముడి గ్రానైట్.. గ్రాయ‌త్రి గ్రానైట్ సంస్థ నుంచే స‌ర‌ఫ‌రా అవుతోంది.
 

click me!