బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిపై కేసీఆర్ కసరత్తు.. రేపు ప్రకటన.. పరిశీలనలో నామా నాగేశ్వరరావు?

By Mahesh K  |  First Published Feb 14, 2024, 9:12 PM IST

బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో కేసీఆర్ బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఇది వరకే కాంగ్రెస్ ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
 


Rajya Sabha: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిని నిర్ణయించడంపై గులాబీ దళం అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. రేపు బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పరిశీలనలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేరు ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికల జరుగుతాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తున్నది. ఇప్పటికే కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. అయితే.. బీఆర్ఎస్ ఇంకా ప్రకటించలేదు. దీంతో రేపు కేసీఆర్ బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించనున్నారు.

Latest Videos

undefined

వాస్తవానికి నామా నాగేశ్వరరావే మరోసారి ఖమ్మం నుంచి బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర ఖాయం అని అనుకున్నారు. కానీ, ఇంతలోనే మరో కోణంలో మాటలు వినిపిస్తున్నాయి. ఈ రేసులో నామా నాగేశ్వరరావు పేరు వినిపిస్తున్నది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.

Also Read: Lovers Temple: పారిపోయి వస్తే పెళ్లి చేసి.. ఆశ్రయం ఇచ్చే ఆలయం.. ఎక్కడుందో తెలుసా?

తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని చూస్తే రెండు సీట్లు కాంగ్రెస్, ఒక సీటు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉన్నది. ఒక వేళ కాంగ్రెస్ మూడు సీట్లకు అభ్యర్థులను ప్రకటించి ఉంటే ఎన్నికలు రసవత్తరంగా సాగేవి. కాంగ్రెస్ పార్టీ రేణుకా చౌదరి, అనిల్‌ను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది. రేపు బీఆర్ఎస్ కూడా ఒకే అభ్యర్థిని ప్రకటిస్తే.. రాజ్యసభ అభ్యర్థుల విజయం దాదాపు ఏకగ్రీవం కానుంది.

click me!