ముఖ్యమంత్రి సినిమా ఫ్లాప్ అయింది.. కేసీఆర్ కు రాజాసింగ్ కౌంటర్..

By AN TeluguFirst Published Nov 18, 2021, 4:27 PM IST
Highlights

హుజూరాబాద్ ఓటమితో గ్రాఫ్ పడిపోవడంతో కేసీఆర్ కవర్ చేసుకునే పనిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. రైతు చట్టాలు బాగున్నాయని గతంలో కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసినందుకే కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని రాజాసింగ్ అన్నారు.

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటరిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సినిమా ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. ప్రజలను వంచించటంలో కేసీఆర్ ను మించిన వాళ్లు లేరని విమర్శించారు. దర్నా చౌక్ వద్దని కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నాడని దుయ్యబట్టారు. 

హుజూరాబాద్ ఓటమితో గ్రాఫ్ పడిపోవడంతో KCR కవర్ చేసుకునే పనిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. రైతు చట్టాలు బాగున్నాయని గతంలో కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసినందుకే కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని Rajasingh అన్నారు.

కాగా, వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్ పార్టీ ఇందిరా పార్క్ వద్ద TRS Maha Dharna చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మహా ధర్నా  కొనసాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో పాటు ధర్నా వేదిక మీద, రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్‌పీ చైర్మన్లు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల వరకే మంత్రులు, టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ఇందిరా పార్క్ వద్దకు చేరుకున్నారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. paddy procurementలో కేంద్రం వైఖరితో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉందని విమర్శించారు. ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగించాలని పిలుపునిచ్చారు.  ఉత్తర భారతంలో రైతాంగం చేస్తున్న పోరాటాన్ని కలుపుకుని భవిష్యత్తులో కూడా పోరాటాన్ని ఉధృతం చేయాల్సి ఉంటుందని అన్నారు. 

కేసీఆర్ ధర్నాపై స్పందించిన కేంద్రం.. బాయిల్డ్ రైస్ కొనే ప్రసక్తే లేదు.. ధాన్యం సేకరణ వివరాలు వెల్లడి..

రైతులకు ప్రయోజనం చేకూరే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. వివిధ పోరాట మార్గాల్ని ఎంచుకుని పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి Niranjan Reddy అనేక సార్లు ఢిల్లీ వెళ్లి.. రైతుల గోసను వివరించారని సీఎం కేసీఆర్ చెప్పారు. 

సీఎం ధర్నాలు చేయడమేమిటనీ కొందరు మాట్లాడుతున్నారని..  2006 లో గుజురాత్ ముఖ్యమంత్రి హోదాలో Narendra Modi 51 గంటల పాటు ధర్నాకు కూర్చొలేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు ధర్నాలు కొనుగోలు చేసే పరిస్థితులు రాష్ట్రాల్లో నెలకొన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.  ఈ పోరాటం ఇక్కడితో ఆగదని... అవసరమైతే దిల్లీకి వెళ్లి.. చేయాల్సి ఉంటుందని అన్నారు.

ధర్నా అనంతరం Raj Bhavanకు వెళ్లి గవర్నర్‌కు తమ డిమాండ్లపై వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా టీఆర్‌ఎస్ ధర్నాలు చేపట్టినప్పటికీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధర్నాలో పాల్గొనడం ఇదే తొలిసారి. 
 

click me!