తెలంగాణ‌కు మ‌ళ్లీ వ‌ర్షాలు

Published : Jul 31, 2017, 05:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
తెలంగాణ‌కు మ‌ళ్లీ వ‌ర్షాలు

సారాంశం

తెలంగాణ కు మరో సారి వర్షాలు ప్రకటించిన వాతావరణ కేంద్రం బంగాళఖాతంలో అల్ఫపీడనం కారణం

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం  ఒడిశా, ఉత్తరాంధ్ర తీరప్రాంతంపై ఆవరించిందని తెలిపింది.

 ఈ ఆవ‌ర్త‌నం ఫ‌లితంగా తెలంగాణ‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని  కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి ప్రకటించారు. రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు. అంతేకాదు తెలంగాణ తో పాటు ఆంధ్ర‌లో కూడా ఈ ప్రభావం ఉంటుంద‌ని, అక్క‌డ వ‌ర్షాలు మోస్తారు నుండి భారీ స్థాయిలో కురువ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

PREV
click me!

Recommended Stories

వేగంగా మారుతోన్న తెలంగాణ రాజ‌కీయం.. మిషన్ కొండా సురేఖ మొదలైందా.?
ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump