ఈ చిన్నారి మృత్యుంజయుడు.. రెండేళ్ల బాబుకు అరుదైన అన్నవాహిక ఆపరేషన్...

Published : Apr 14, 2022, 10:35 AM IST
ఈ చిన్నారి మృత్యుంజయుడు.. రెండేళ్ల బాబుకు అరుదైన అన్నవాహిక ఆపరేషన్...

సారాంశం

ఒమన్ నుంచి వచ్చిన ఓ చిన్నారికి హైదరాబాద్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. పుట్టుకతోనే అన్నవాహిక సమస్య ఉన్న బాలుడికి ఆపరేషన్ చేసి పునర్జన్మ ప్రసాదించారు. 

హైదరాబాద్ : పుట్టుకతోనే అన్నవాహిక సక్రమంగా అభివృద్ధి చెందని Oman దేశానికి చెందిన రెండేళ్ల చిన్నారికి hyderabadలోని రెయిన్బో చిన్నపిల్లల ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. బుధవారం ఆసుపత్రి వైద్యులు మైనక్ దేబ్, డాక్టర్ హరీష్ జయరాం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఒమన్ కు చెందిన బాలుడు వాఫీకి పుట్టుకతోనే అన్నవాహిక సక్రమంగా అభివృద్ధి చెందలేదు. 

ఈ స్థితిని ‘ఈసోఫాగెల్ అట్రీసియా, ట్రాచియో-ఈసోఫాగెల్ ఫిస్టులా (ఈఏ/టీఈఎఫ్) సమస్యగా వ్యవహరిస్తారు. ఐదు వేల మంది శిశువుల్లో ఒకరికి ఈ సమస్య వస్తుంది. దీనివల్ల పిల్లలు నోటితో ఆహారాన్ని సక్రమంగా తీసుకోలేరు. ఈ బాలుడికి ఒమన్ లో పలు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. ఒమన్ నుంచి చిన్నారిని వారి తల్లిదండ్రులు హైదరాబాదులోని రెయిన్ బోకు ఫిబ్రవరి 2తేదీన తరలించారు. మార్చి1న బాలుడికి శస్త్రచికిత్స చేసి అన్నవాహికను విజయవంతంగా పునరుద్ధరించారు. ఆ తరువాత ఇరవై మూడు రోజులపాటు పీడియాట్రిక్ ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. కుమారుడి ప్రాణాలు కాపాడిన వైద్యులకు చిన్నారి తండ్రి అలీ కత్రి కృతజ్ఞతలు తెలిపారు. 

ఇదిలా ఉండగా, నిరుడు సెప్టెంబర్ 4న లక్నోలోని ఓ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. లక్నోలోని బలరాంపూర్ ఆసుపత్రిలో 17 ఏళ్ల బాలిక కడుపు నుండి దాదాపు 2 కిలోల బరువున్న జుట్టును వైద్యులు తొలగించారు. ఆపరేషన్ చేసిన గ్యాస్ట్రో-సర్జన్ డాక్టర్ ఎస్ఆర్ సమద్దర్ మాట్లాడుతూ, బాలిక ట్రైకోబెజోవర్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుందని అన్నారు. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే రోగులు తమ జుట్టును తామే పీక్కుని తినేస్తుంటారు. 

ఇంకా ఆయన ఇలా మాట్లాడుతూ  "10 రోజుల క్రితం, ఈ అమ్మాయి మా ఆసుపత్రికి వచ్చింది. ఆ సమయంలో ఆమెకు వాంతులు, కడుపు నొప్పి తీవ్రంగా ఉంది’ అని చెప్పింది. ఆమె పొత్తికడుపు పై భాగంలో బాగా వాపు వచ్చింది. అయితే ఆమె సమస్యను అల్ట్రాసౌండ్, ఎక్స్-రే లేదా సిటి స్కాన్ ద్వారా గుర్తించలేము. కాబట్టి, ఎండోస్కోపీ చేశాం. అది చూసి మేము షాక్ అయ్యాం. ఆమె కడుపులో పెద్ద ట్రైకోబెజోవర్‌ ఉంది"అని ఆయన అన్నారు.

వెంటనే ఆపరేషన్ కు సిద్దం చేసిన డాక్టర్ సమద్దర్.. తనతో పాటు వైద్యుల బృందంతో కలిసి గురువారం బాలికకు శస్త్రచికిత్స చేశారు. ఆమె కడుపులో నుండి 20 సెంటీమీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల వెడల్పు గల 2 కేజీల బరువున్న జుట్టును బయటికి తీశారు. ఆ వెంట్రుకల ముద్ద ఆ అమ్మాయి కడుపులో రాతి బంతిలా తయారయ్యింది. 

"ఇలా వెంట్రుకలు గడ్డలా ఏర్పడడం వల్ల.. తిన్న ఆహారం కడుపులో నిలవదు. అది చిన్న ప్రేగులోకి వెళ్ళదు. అందుకే, అమ్మాయి బలహీనంగా ఉంది. ఆమె 17 సంవత్సరాలున్నా.. బరువు మాత్రం 32 కిలోలు మాత్రమే ఉంది. ఇప్పుడామెకు ఆపరేషన్ చేశాం. ఆమె త్వరలోనే కోలుకుంటుంది.  నాలుగైదు రోజుల్లో మామూలుగా తినగలుగుతుంది"అన్నారాయన.

ఇలా జుట్టు ఎందుకు తింటారు. ఈ వింత అలవాటుకి కారణమేమిటని అడిగితే..  డాక్టర్ సమద్దర్ ఈ వ్యాధి సాధారణంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న రోగులలో కనిపిస్తుందని చెప్పారు. అంతేకాదు "ఇది మానసిక సమస్య. దీనితో బాధపడుతున్న వాళ్లు తమ జుట్టును తామే పీక్కుని..ఇతరులు చూడకుండా చాటుగా తింటారు. ఈ అమ్మాయి కోలుకున్న తరువాత తనను మా ఆసుపత్రిలోని సైకియాట్రిక్ డిపార్ట్ మెంట్ కు రిఫర్ చేస్తాం. అక్కడ ఆమెకు కౌన్సెలింగ్ దొరుకుతుంది" అని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!