కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంటిపై దుండగుల దాడి: తీవ్రంగా ఖండించిన రేవంత్ రెడ్డి

Published : Apr 14, 2022, 09:57 AM IST
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంటిపై దుండగుల దాడి: తీవ్రంగా ఖండించిన రేవంత్ రెడ్డి

సారాంశం

కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు ఇంటిపై దుండగులు దాడి చేశారు. అర్ధరాత్రి  గుర్తు తెలియని వ్యక్తులు వీహెచ్ ఇంటిపై రాళ్లు విసిరారు. ఆయన ఇంటిముందు ఉన్న కారును ధ్వంసం చేశారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు ఇంటిపై దుండగులు దాడి చేశారు. అర్ధరాత్రి  గుర్తు తెలియని వ్యక్తులు వీహెచ్ ఇంటిపై రాళ్లు విసిరారు. ఆయన ఇంటిముందు ఉన్న కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్పందించిన వీహెచ్.. ఈ చర్యకు పాల్పడిన వారిని కనిపెట్టాల్సిన బాధ్యత పోలీసులదేనని అన్నారు. వారిని గుర్తించిన చర్యలు తీసుకోవాలని కోరారు. బడుగు, బలహీన వర్గాల సమస్యలు పరిష్కారానికి తాను ముందుంటానని చెప్పారు. మాజీ పీసీసీ అధ్యక్షుడిగా,  మంత్రిగా పనిచేసిన తనకు కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. గతంలో బెదిరింపు కాల్స్ వచ్చిన సందర్భంలో డీజీపీకి విన్నవించినా కూడా పరిష్కారం చూపలేదని  చెప్పారు. 

వీహెచ్ ఇంటిపై దాడిని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వీహెచ్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. వీహెచ్ ఇంటిపై దాడికి పాల్పడిన దోషులను గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలని  పోలీసులను కోరారు. కాంగ్రెస్ నేతలకు పోలీసులు భద్రత  కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులు జరిగితే  ఊరుకునేది లేదని అన్నారు

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?