హైదరాబాద్‌కు మూడు రోజులు పాటు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ..

Published : Oct 04, 2022, 05:44 PM IST
హైదరాబాద్‌కు మూడు రోజులు పాటు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ..

సారాంశం

హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వీడటం లేదు. రేపటి నుంచి మరో మూడు రోజుల పాటు నగరంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వీడటం లేదు. రేపటి నుంచి మరో మూడు రోజుల పాటు నగరంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఎల్లో అలర్ట్ కూడా జారీచేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక, మంగళవారం కూడా హైదరాబాద్‌‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.

తెలంగాణలో రాబోయే రెండు రోజుల వాతావరణ సూచన ఇలా ఉంది.. బుధవారం( అక్టోబర్ 5) రోజున రంగారెడ్డి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే పలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గురువారం (అక్టోబర్ 6) రోజున ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mutton : కిలో చికెన్ ధరకే కిలో మటన్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే..!
Kavitha Emotional Speech: నా మీద కక్ష కట్టి పార్టీ నుంచి నెట్టేశారు | Asianet News Telugu