డేటింగ్ యాప్‌తో రూ. 1. 50 కోట్ల మోసం: ఢిల్లీకి చెందిన అరుణ్ ను అరెస్ట్ చేసిన హైద్రాబాద్ పోలీసులు

By narsimha lode  |  First Published Oct 4, 2022, 5:21 PM IST


డేటింగ్ యాప్ పేరుతో  మోసాలకు పాల్పడుతున్న అరుణ్ అనే వ్యక్తిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 


హైదరాబాద్: డేటింగ్ యాప్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన అరుణ్ హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు.ఎస్కార్ట్ సర్వీస్, కాల్ బాయ్ పేరుతో హైద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి నుండి రూ. 1.50 కోట్లు వసూలు చేశారు. తాను మోసపోయినట్టుగా గుర్తించిన అతను సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు అరుణ్ ను అరెస్ట్ చేశారు. 

గతంలో కూడ డేటింగ్ యాప్ పేరుతో పలువురిని మోసం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ తరహ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మోసాలకు గురౌతున్నారు. 

Latest Videos

డేటింగ్ యాప్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురికి చెందిన  ముఠాను సైబరాబాద్ పోలీసులు 2020 నవంబర్ 20వ తేదీన అరెస్ట్ చేశారు. డేటింగ్ యాప్ లో యువకులను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తారు.ఈ విషయమై బాధితులు మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి రూ. 14 లక్షలు, షాద్ నగర్ కు చెందిన మరో వ్యక్తి నుండి లక్ష పోగోట్టుకున్నారు. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

డేటింగ్ యాప్ లో  పరిచయమైన  అపరిచుతురాలి మాటలు నమ్మి  ఓ బ్యాంక్ మేనేజర్ రూ.5.13 కోట్లు పోగొట్టుకున్నాడు.ఈ ఘటన బెంగుళూరులో ఈ ఏడాది జూన్ మాసంలో జరిగింది.

77 ఏళ్ల వయస్సున్న వ్యక్తిని డేటింగ్ యాప్ నిర్వాహకులు బురిడీ కొట్టించారు.  అతడి నుండి రూ. 11 లక్షలను కాజేశారు కేటుగాళ్లు.  ఈ ఘటన 2021 జూలై మాసంలో చోటు చేసుకుంది. 

హైద్రాబాద్  నిజాంపేటలో  యువతి డేటింగ్ యాప్ లో తన ప్రొఫైల్ అప్ లోడ్ చేసింది. ఈయాప్ లో ఆమె ప్రొపైల్ చూసిన ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే అప్పటికే అతనికి పెళ్లైంది. ఆ విషయం దాచిపెట్టి యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న యువతి పోలీసులకు పిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోవడానికి ముందే విషయం తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని 2021 జూలై 15న పోలీసులు అరెస్ట్ చేశారు.
 

click me!