కేటిఆర్ సహా మంత్రులపై రైల్వే కేసుల కొట్టివేత

First Published Aug 30, 2017, 2:21 PM IST
Highlights

కేటిఆర్ సహా మంత్రులపై రైల్వే కేసులు కొట్టివేత

ఐదేళ్లుగా కొనసాగిన కేసులు

ఊపిరి పీల్చుకున్న అమాత్యులు

తెలంగాణ మంత్రులు కేటిఆర్, నాయిని నర్సింహ్మారెడ్డి, పద్మారావు గౌడ్ సహా 14 మందికి రైల్వే కేసుల నుంచి ఊరట లభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో మౌలాలి దగ్గర రైల్ రోకో సందర్భంగా నమోదైన కేసులో సికింద్రాబాద్ రైల్వే కోర్టు తీర్పు ఇవాళ తీర్పు వెలువరించింది. మంత్రులు కేటీఆర్, నాయిని, పద్మారావు సహా 14 మందిపై నమోదైన కేసును కొట్టివేసింది రైల్వే న్యాయస్థానం.

2011లో వీరిపై సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైళ్ల రాకపోకలను అడ్డుకోవడమే కాకుండా కేంద్రప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారన్న నెపంతో వీరిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి బుధవారం సికింద్రాబాద్‌లో రైల్వే కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి గతంలో వారు చాలా సార్లు కోర్టుకు హాజరయ్యారు.

వాదోపవాదనలు విన్న తర్వాత న్యాయస్థానం 14 మందిపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. దాదాపు ఐదేళ్లపాటు ఈ కేసు విచారణ జరిగింది. తుదకు రైల్వే పోలీసులు సరైన ఆధారాలు చూపలేకపోవడంతో కేసు వీగిపోయింది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

click me!