
తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ మీద చాలా కేసులే ఉన్నట్లుంది. ఈ రోజు ఆయన రైల్వే కోర్టు కేసుకు హాజరయ్యారు. తెలంగాణా ఉద్యమ కాలంలో రైల్ రోఖోను నిర్వహించడానికి సంబంధించిన కేసు ఇది. కేసు రైల్వే అధికారులు బుక్ చేసిన కేసు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం లాగా ఉపసంహరించుకునేందుకు వీలు లేదు.అందువల్ల రైల్వేకోర్టుకు ఆయన తప్పనిసరిగా హాజరవ్వాలి. హాజరవుతున్నారు. ఈ రోజు కూడా హాజరయ్యారు. తీరా బయటకు వచ్చేటప్పుడు , హమ్మయ్య, ఈ రోజుకిలా గడించిందనుకుంటున్నపుడు ఇంకా ఆరుకేసులు పెండింగులో ఉన్నాయని లాయర్ చెప్పాడు. ఈ విషయాన్ని ఆయనట్వీట్ చేశారు.