ట్రాఫిక్ డీసీపీ, సినీ నటి డింపుల్ హయతి మధ్య వివాదానికి కారణమైన కారు పార్కింగ్ విషయంలో ఏం జరిగిందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు పార్కింగ్ వద్ద సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్: ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, సినీ నటి డింపుల్ హయతి మధ్య కారు పార్కింగ్ వివాదంలో ఏం జరిగిందనే దానిపై జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ట్రాఫిక్ డీపీసీ రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అపార్ట్ మెంట్ పార్కింగ్ స్థలంలో ఏం జరిగిందనే విషయమై పోలీసులు సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తున్నారు.
ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారు పార్కింగ్ చేసిన ప్రాంతంలో ఉన్న కోన్స్ ను సినీ నటి డింపుల్ హయతి కాలితో తన్నింది. ఈ దృశ్యాలు సీసీటీవీ పుటేజీలో కన్పించాయి.
undefined
జర్నలిస్ట్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో సీ1, సీ3 ప్లాట్లలో సినీ నటి హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అపార్ట్ మెంట్ పార్కింగ్ విషయంలో సినీ నటి డింపుల్ హయతి , ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే మధ్య వివాదం సాగుతుంది. కారు పార్కింగ్ విషయంలో తమ డ్రైవర్ ,ఇతర స్టాఫ్ తో సినీ నటి డింపుల్ హయతి గొడవ పెట్టకుంటుందని రాహుల్ హెగ్డే ఆరోపించారు.
తాను ఎప్పుడంటే విధులకు హాజరయ్యేందుకు వీలుగా తన కారుకు అడ్డుగా వాహనం పార్క్ చేయవద్దని కూడా సినీ నటి డింపుల్ హయతి ని కోరినట్టుగా రాహుల్ హెగ్డే చెప్పారు. కానీ ఆమె తీరులో మార్పు రాలేదని ఆయన చెప్పారు.
also read:నటి డింపుల్ హయతితో విభేదాలు లేవు: ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే
రెండు రోజుల క్రితం అపార్ట్ మెంట్ పార్కింగ్ విషయంలో చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదిలా ఉంటే తనపై కేసు నమోదు కావడంపై డింపుల్ హయతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. అధికారాన్నిఅడ్డు పెట్టుకుని తప్పులను ఆపలేరని వ్యాఖ్యానించారు.