రాహుల్ గాంధీ తెలంగాణ నుంచే పోటీ చేస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయానాడ్ ఎంపీ రాహుల్ గాంధీ గురించి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కేరళ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారని వివరించారు. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి గెలుస్తారని, ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి కూడా అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం కొత్తగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా కట్టడి చేస్తామని వివరించారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్‌ను తిరస్కరించారని అన్నారు. బీఆర్ఎస్ వైఖరిని ఇప్పటికీ అసహ్యిస్తున్నారని ఆరోపించారు.
Also Read : YCP: నెల్లూరులో వేమిరెడ్డి దారిలోనే సుబ్బారెడ్డి.. పార్టీకి రాజీనామా .. త్వరలోనే టీడీపీలోకి . .!
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే కీలకమైన నిర్ణయాలు తీసుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోపిడీని, దౌర్జన్యాలను అడ్డుకున్నామని వివరించారు. ఇది ఇందిరమ్మ రాజ్యం అని, దొరల ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీల్లో నాలుగింటిని అమలు చేస్తున్నదని చెప్పారు. ఇక ఉద్యోగాల నియామకాలపైనా ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటామని పేర్కొన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని వివరించారు.