
ధర్నా చౌక్ ఉద్యమం విజయవంతమయ్యాక తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేస్తున్నది. ఇందులో భాగంగా జూన్ 1 వ తేదీన సంగారెడ్డి ప్రజా గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహస్తున్నది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉండటం కెసిఆర్ వైఫల్యానికి కారణమనే ప్రచారం తో కాంగ్రె స్ ఈ సభని నిర్వహిస్తున్నది.
ఈ విషయాన్ని తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆగలేదని, చివరకు రైతుల ఆత్మహత్యలలో తెలంగాణా దేశంలో రెండవదనే గుర్తింపు తెచ్చుకుందని ఆయన చెప్పారు.
రైతులు ఆత్మహత్య చేసుకుంటే దానికి గత కాంగ్రెస్ అని అనడం నిస్సిగ్గు వ్యవహారమని ఆయన వ్యాఖ్యానించారు.
" తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ప్రాణాలు తెగించి.. పోరాటం చేశారు.. ప్రజాగర్జన లో ఇది ఎత్తిచూపుతాము.ఋణమాఫీ.. పై వడ్డీ ని ప్రభుత్వమే భరిస్తుందని అపుడు చెప్పి, ఇపడు మాట మార్చారు. ప్రోత్సాహం లేక మహిళా సంఘాలు కుంటుపడుతున్నాయి. తెరాసను నమ్ముకుని మోసపోయామనే భావన లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు," అని ఉత్తమ్ అన్నారు.
కొత్త భూ సేకరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్ట్ లో సవాల్ చేస్తుందని ఆయన వెల్ల డించారు.