
కాంగ్రెస్ పార్టీ ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ అద్యక్షుడి హోదాలో త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెలాకరున ఆయన పర్యటన ఉండనుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అంతకు ముందే ఆయన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టనున్నందున అద్యక్ష హోదాలో తెలంగాణకు రానున్నాడు.
తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్సే కావున అభివృద్ది కూడా కాంగ్రెస్ వల్లనే సాద్యం అన్న నినాదంతో నిజాం కాలేజ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ నిర్వహించనున్నారు.అందులో పాల్గొనడానికి రాహుల్ ను ఆహ్వానించినట్లు, అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు పిసిసి తెలిపింది.
ఇంతకుముందు సంగారెడ్డి సభలో రాహుల్ గాంధీ ఆకట్టుకునేలా మాట్లాడి తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపాడు. ఆ సభ వల్ల తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నైతిక స్థైర్యం పెరిగిందని, అందువల్లే మరోసారి రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తే బావుంటుందని పిసిసి భావిస్తోంది. దీని వల్ల తెలంగాణలో కాంగ్రెస్ కు మరింత బలం చేకూరుతుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
అయితే ఈ సారి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తొలిసారిగా తెలంగాణ కు రానున్నాడు.