తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోంది: మంథనిలో రాహుల్ గాంధీ

By narsimha lode  |  First Published Oct 19, 2023, 2:50 PM IST

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను  అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలౌతున్నాయో  లేదో  కనుక్కోవాలని  రాహుల్ ప్రజలను కోరారు. 


మంథని: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. బస్సు యాత్రలో భాగంగా  గురువారంనాడు  మంథనిలో జరిగిన సభలో  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. బస్సు యాత్ర రెండో రోజున భూపాలపల్లి నుండి  కాటారం, మంథనికి చేరుకుంది.  మీరంతా తన కుటుంబ సభ్యులని రాహుల్ గాంధీ చెప్పారు. 

ప్రస్తుతం ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని రాహుల్ గాంధీ  తేల్చి చెప్పారు. కర్ణాటక ఎన్నికల సమయంలో  ఇచ్చిన హామీలను ఆ రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. ఈ విషయాలను అవసరమైతే తెలుసుకోవాలని రాహుల్ కోరారు.  కేసీఆర్ 

Latest Videos

పెరిగిన ధరలకు మహిళలు ఇబ్బంది పడుతున్నారని  రాహుల్ గాంధీ తెలిపారు. తాను ఇక్కడికి అబద్దాలు చెప్పడానికి రాలేదన్నారు. గ్యాస్ సిలిండర్ కు రూ. వెయ్యి చెల్లించాల్సి వస్తుందన్నారు.ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు కూడా పెంచారని ఆయన చెప్పారు.  తాము అధికారంలోకి రాగానే మహిళల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

తెలంగాణలో యువతకు ఉద్యోగాలు లేవన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళల బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ. 2500 వేస్తామన్నారు. రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని రాహుల్ గాంధీ  తెలిపారు.

also read:నాపై 24 కేసులు, కేసీఆర్ అవినీతిపై ఎందుకు నోరు మెదపరు: బీజేపీ, బీఆర్ఎస్ పై రాహుల్ ఫైర్

రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం కల్పించనున్నట్టుగా  రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో  బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు.  బీజేపీ ఏ చట్టం చేసినా బీఆర్ఎస్ మద్దతిచ్చిన విషయాన్ని  రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ ను టార్గెట్ చేశాయన్నారు.దేశంలో కులగణన  చేయాలని తాను పార్లమెంట్ లో ప్రస్తావించినట్టుగా  రాహుల్ గాంధీ చెప్పారు.
 

click me!