కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖకు ప్రమాదం తప్పింది. కొండా సురేఖ నడుపుతున్న స్కూటీ అదుపు తప్పడంతో కిందపడిపోయారు.దీంతో ఆమెకు స్వల్ఫ గాయాలు అయ్యాయి.
కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖకు ప్రమాదం తప్పింది. కొండా సురేఖ నడుపుతున్న స్కూటీ అదుపు తప్పడంతో కిందపడిపోయారు.దీంతో ఆమెకు స్వల్ఫ గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే కొండా సురేఖను ఆమె భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయభేరి పేరిట బస్సు యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ విజయభేరీ యాత్ర రెండో రోజైన నేడు భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కొండా సురేఖ కూడా పాల్గొన్నారు.
అయితే కొండా సురేఖ నడుపుతున్న స్కూటీ అదుపుతప్పడంతో ఆమె కిందపడిపోయారు. దీంతో ఆమెకు ముఖంతో పాటు చేతులపై స్పల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడివారు వెంటనే కొండా సురేఖను ఆస్పత్రికి తరలించారు. అయితే సురేఖకు ఎటువంటి ప్రమాదం లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.