తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో గురువారం ఉదయం నుంచే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల పోలింగ్ జోరుగా ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లకు తరలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు, సినీతారలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటింగ్ కు సంబంధించి ఓ ట్వీట్ చేశారు.
"నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు. నా తెలంగాణ సోదర సోదరీమణులారా! రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండి! కాంగ్రెస్ ను గెలిపించండి!" అని తెలుగులో ఆయన ట్వీట్ చేశారు.
undefined
ఇదిలా ఉండగా, పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో ఓటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యింది. ఉద్యోగస్తులు వివిధ పనులకు వెళ్లేవారు.. ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు.
నా తెలంగాణ సోదర సోదరీమణులారా!
రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి.
బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండి! కాంగ్రెస్ ను గెలిపించండి!
Today, Prajala will defeat Dorala!
Brothers and sisters of Telangana, step out and vote in large… pic.twitter.com/yvrvNMBziX