తాండూరులో టెన్త్ పేపర్ లీక్ ప్రచారం:ఎస్ఎస్‌సీ బోర్డు వద్ద ఎన్‌ఎస్‌యూఐ ఆందోళన, ఉద్రిక్తత

Published : Apr 03, 2023, 06:26 PM ISTUpdated : Apr 03, 2023, 07:25 PM IST
తాండూరులో టెన్త్ పేపర్ లీక్   ప్రచారం:ఎస్ఎస్‌సీ బోర్డు వద్ద ఎన్‌ఎస్‌యూఐ  ఆందోళన, ఉద్రిక్తత

సారాంశం

 తాండూరు స్కూల్ నుండి  టెన్త్ పేపర్    పరీక్షా కేంద్రం నుండి బయటకు  వచ్చిన  ఘటనపై  ఎన్ఎస్‌యూఐ   ఆందోళనకు దిగింది. ఈ ఆందోళనతో  ఎస్ఎస్‌సీ బోర్డు వద్ద ఉద్రిక్తత  నెలకొంది. 

హైదరాబాద్: తాండూరులో  టెన్త్ పేపర్  వాట్సాప్ లో  బయటకు వచ్చిన  ఘటనపై  ఎన్ఎస్‌యూఐ  ఆందోళనకు దిగింది. హైద్రాబాద్ లో  ఎస్ఎస్‌సీ బోర్డు వద్ద  ఎన్ ఎస్‌‌యూఐ కార్యకర్తలు  సోమవారంనాడు ఆందోళనకు దిగారు. 

సోమవారం నాడు  హైద్రాబాద్ ఎస్ఎస్‌సీ బోర్డు ముందు  ఎన్‌ఎస్‌యూఐ  కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.  కార్యాలయం బోర్డును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. కార్యాలయంలోకి  కోడిగుడ్లు విసిరారు.  సీఎం  కేసీఆర్   దిష్టిబొమ్మను దగ్దం  చేశారు  కార్యాలయంలోనికి వెళ్లేందుకు  ప్రయత్నించారు.  పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.  పోలీసులతో  ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట  చోటు  చేసుకుంది. దీంతో  ఉద్రిక్తత  నెలకొంది.  ఎన్‌ఎస్‌యూఐ   రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా  పలువురు ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్  చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!