శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఖతార్ ఎయిర్‌వేస్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Published : Sep 23, 2023, 11:52 AM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఖతార్ ఎయిర్‌వేస్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

సారాంశం

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఖతార్‌లోని దోహా నుంచి నాగ్‌పూర్‌  వెళ్తున్న విమానం శనివారం ఉదయం శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. నాగ్‌పూర్‌లో వాతావరణ పరిస్థితులు అనుకలించకపోవడంతో విమానాన్ని హైదరాబాద్‌కు దారిమళ్లించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఆ విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే విమానంలోని ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఇక, శుక్రవారం అర్ధరాత్రి నుండి నాగ్‌పూర్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు చర్యలు ప్రారంభించాయి. వాతావరణ శాఖ ప్రకారం.. నాగ్‌పూర్ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం 5.30 గంటల వరకు 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్