తుమ్మల నాగేశ్వరరావు నీచాతి నీచంగా మాట్లాడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ విరుచుకుపడ్డారు. తుమ్మల వల్ల తెలంగాణ రాలేదన్నారు.
ఖమ్మం : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై బీఆర్ఎస్ నేతలు మాటల యుద్ధానికి దిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ నుంచి టికెట్టు దక్కకపోవడంతో…కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావుకు, కెసిఆర్ కు మధ్య వార్ మొదలైంది. దీంతో ఈ మాటల యుద్ధం పీక్ స్టేజ్ కి చేరుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మల మీద చేసిన వ్యాఖ్యలను.. తుమ్మల తీవ్రస్థాయిలో తిప్పి కొట్టాడు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మీద మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు.
తుమ్మల నాగేశ్వరరావుకు కెసిఆర్ అవకాశం కల్పించకపోతే రాజకీయాల్లో ఇప్పటికే రిటైర్ అయి ఉండే వారిని ఎద్దేవా చేశారు. శనివారం పువ్వాడ అజయ్ మీడియాతో మాట్లాడారు.. ‘ముఖ్యమంత్రి కెసిఆర్ మీద తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన నీచాతి నీచంగా మాట్లాడుతున్నారని అది బాధాకరమన్నారు. గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు నా చేతిలో ఓడిపోయారు. అప్పుడు కెసిఆర్ రాజకీయ అవకాశం కల్పించకపోతే తుమ్మల ఈనాటికీ రిటైర్ అయ్యేవారు అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో తుమ్మల లేడు. ఆయన లేకపోతే తెలంగాణ రాలేదా? ‘తుమ్మలా నీవల్ల తెలంగాణ రాలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకో. జై తెలంగాణ అన్న వారిని జైలులో పెట్టించావు’ అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తుమ్మల మాటలు నమ్మశక్యంగా లేవని.. తుమ్మల ఏమైనా పార్టీ అధినేత లేఖ ముఖ్యమంత్రి టికెట్లు ఇప్పించడానికి అని ప్రశ్నించారు. తుమ్మలను ఓడించడం కోసం గత ఎన్నికల్లో కేటీఆర్ ప్రయత్నం చేశారన్నది అర్ధరహితమని చెప్పుకొచ్చారు. దీనికోసం కందాలకు కేటీఆర్ డబ్బులు ఇచ్చారన్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.