శంషాబాద్ లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. దేవ్ ఫుట్ వేర్ షాప్ కమ్ గోదామ్ లో నేటి తెల్లవారుజామున 3 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది.
శంషాబాద్ లోని ఫుట్ వేర్ షాప్ కమ్ గోడౌన్ లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చెలరేగింది. దీని వల్ల లక్షలాది రూపాయల ఆస్తి వాటిల్లింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సమీపంలోని అగ్నిమాపక కేంద్రాల నుంచి రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. నేటి తెల్లవారుజామున 3 గంటల సమయంలో శంషాబాద్ లోని దేవ్ ఫుట్ వేర్ షాప్ లో మంటలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. అవి వేగంగా స్టోర్ మొత్తానికి వ్యాపించాయని పేర్కొన్నారు.
అత్యాచారాలు, దోపిడీల్లో ముస్లింలు నెంబర్ 1 - ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి కచ్చితమైన కారణం ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. ఈ అగ్నిప్రమాదం వల్ల రూ.30 లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిళ్లిందని షాప్ యజమానులు తెలిపారు.