పంజాగుట్ట బాలిక హత్య కేసు : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని.. తల్లే దారుణంగా చంపేసింది..

By AN TeluguFirst Published Nov 13, 2021, 10:54 AM IST
Highlights

ఘటనా స్థలానికి కొంత దూరంలో లభించిన కీలకాధారాలతో నిందితులను గుర్తించారు.  ఘటనకు సంబంధించి ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించి పోలీసులు వివరాలు వెల్లడించనున్నారు.

హైదరాబాద్ :  నగరంలోని Panjaguttaలో జరిగిన బాలిక హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఈ కేసులో చిన్నారి తల్లితో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని సొంత తల్లే తన కుమార్తెను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడయిందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్ లోని అజ్మీర్ లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

పంజాగుట్టలోని ద్వారకపురి కాలనీలో ఒక దుకాణం ముందు ఎనిమిది రోజుల క్రితం అనుమానాస్పదస్థితిలో  బాలిక మృతదేహం పోలీసులకు కనిపించింది. అప్పటి నుంచి పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు.  ఘటనా స్థలానికి కొంత దూరంలో లభించిన key of evidenceతో నిందితులను గుర్తించారు.  ఘటనకు సంబంధించి ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించి పోలీసులు వివరాలు వెల్లడించనున్నారు.

వివిధ రాష్ట్రాల్లో గాలింపు..
కేసుకు సంబంధించి ఒక ప్రకటన రూపొందించి  తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలకు  పంపించారు. మరోవైపు social mediaలోనూ  చిన్నారి చిత్రాన్ని పోస్ట్ చేశారు.  సీసీ కెమెరాలను పరిశీలిస్తుండగా బుధవారం రాత్రి కీలక ఆధారం లభించింది.  నిందితులు అజ్మీర్ లో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. వారు  పాతబస్తీకి చెందిన వారిగా గుర్తించారు.  బాలిక తండ్రి చనిపోవడంతో ఆమె మరో వ్యక్తితో Extramarital affair కొనసాగిస్తుందని వారు 
Beggars అని పోలీసులకు ఆధారాలు లభించాయి. 

ఇదిలా ఉండగా, ఈ దీపావళి  పండగ రోజు హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితితో నాలుగైదేళ్ల బాలిక మృతదేహం లభించిన విషయం తెలిసిందే. ఓ మూసివున్న దుకాణం బయట చిన్నారి మృతదేహం పడివుండటం కలకలం రేపింది. అయితే సదరు బాలికది హత్యేనని తేల్చిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదికలో బాలిక కడుపులో బలంగా తన్నడం వల్లే చనిపోయినట్లు తేలిందని తెలిపారు. 

పంజాగుట్ట చిన్నారి హత్య కేసు: ఇద్దరి అరెస్ట్

చనిపోయిన తర్వాతే బాలిక మృతదేహాన్ని ఓ మహిళ తీసుకువచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకాపురి కాలనీలో మూసివున్న షాప్ ముందు పడేసినట్లు సిసి కెమెరాల ఆధారంగా గుర్తించినట్లు తెలిపారు. సదరు మహిళ వెల్లిన మార్గాల్లోని సిసి కెమెరాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. 

చిన్నారిని హత్యచేసిన నిందితులను పట్టుకునేందుకు నాలుగు పోలీస్‌, మూడు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పనిచేస్తున్నాయి. త్వరలోనే నిందితులను పట్టుకుని బాలిక హత్య మిస్టరీని చేధిస్తామని ఐదు రోజుల క్రితం పోలీసులు తెలిపారు. 

దీపావళి రోజు ఉదయం జేవీఆర్ పార్కు ఎదుట ద్వారకపురి కాలనీలోని మూసిఉన్న దుకాణం ఎదుట బాలిక అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు బాలిక మృతిచెందినట్లు గుర్తించారు. 

అయితే ఆ పరిసరాలంతా పరిశీలించి పోలీసులు ఎక్కడా రక్తపు మరకలు లేకపోవడంతో ఘటన ఇక్కడ జరగలేదని నిర్ధారణకు వచ్చారు. ఎక్కడో murder చేసి గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ పడేసి ఉంటారని అనుమానంతో సమీపంలోని దాదాపు వందలకుపైగా కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఓ మహిళ బాలిక మృతదేహాన్ని తీసుకువచ్చి పడేసినట్లు గుర్తించారు.  

బాలిక మృతదేహంపై పాత గాయాలున్నాయని... అత్యాచారం జరిగిన దాఖలాలు లేవని పశ్చిమ మండలం జాయింట్ కమిషనర్ ఏ ఆర్ శ్రీనివాస్ వెల్లడించారు.  రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు... రాష్ట్రవ్యాప్తంగా missing case వివరాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదిక ఆధారంగా బాలికది హత్యగా తేలింది. 

click me!