
చింతలపాలెం : కామంతో కళ్లు మూసుకుపోయిన ప్రధానోపాధ్యాయుడు.. ‘పట్టుకోండి చూద్దాం’ అనే ఆట పేరుతో బాలికల కళ్ళకు గంతలు కడతాడు. పిల్లలతో కలిపి తాను ఆడుతున్నట్లు గా నటిస్తూనే కళ్ళకు గంతలు కట్టి ఉన్న Girlsను ఏమార్చి.. Store roomలోకి తీసుకు వెళ్తాడు.
అక్కడ వారిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘోరం వెలుగు చూసింది. ఇప్పటివరకు నలుగురు చిన్నారులపై Sexual assaultకి పాల్పడినట్లు వారి తల్లిదండ్రుల ద్వారా తెలిసింది.
బాధితులంతా మూడు, నాలుగు తరగతి చదువుతున్న పిల్లలే. బడికి వెళ్లేందుకు ఆ చిన్నారులు భయపడుతుండటంతో వారి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో వారిని Parents ప్రశ్నించడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. నిందితుడు, అక్కడ Principalగా పనిచేస్తున్న అనిల్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.
చింతలపాలెం ఎస్సై రంజిత్ రెడ్డి, బాధిత విద్యార్థినుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… అనిల్ స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడ. ఆ పాఠశాలలో ఎనిమిదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 28 ఏళ్ల అనిల్ కు గత ఏడాది పెళ్లయింది. మేళ్లచెరువు మండలం కేంద్రంలో ఉంటూ పాఠశాలకు వెళ్లి వస్తున్నాడు.
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఆ schoolలో 90 మంది పిల్లలు చదువుతున్నారు. పాఠశాలలో నాలుగు తరగతి గదులు ఉన్నాయి. ఒక స్టోర్ రూమ్ ఉంది. అక్కడ అనిల్ తో పాటు మరో ఉపాధ్యాయుడు మాత్రమే పనిచేస్తున్నారు. టీచర్ల కొరత ఉండటంతో 90 మంది పిల్లలను ఒకేచోట ఉంచి పాఠాలు చెబుతున్నారు.
మధ్యాహ్నం మూడు గంటల మధ్య విద్యార్థులతో ఆటలు ఆడించి ఇంటికి పంపుతున్నారు. గత పది రోజులుగా బాలికలపై అనిల్ లైంగిక దాడికి పాల్పడుతునట్లు గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రేమకు అడ్డుగా ఉన్నాడని.. కన్న తండ్రిని మైనర్ కూతురే కడతేర్చింది...
ఇదిలా ఉండగా, మరో ఘటనలో మహబూబ్ నగర్ జిల్లాలో ఓ యువతికి మద్యం తాగించి, అత్యాచారం చేసిన ఘటన బయటపడింది. హన్వాడ మండలం కోత్లాబాద్ కి చెందిన సదరు యువతి ప్రతిరోజూ మహబూబ్ నగర్ కు వచ్చి దినసరి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే మల్కాపూర్ కి చెందిన రాజేందర్ రెడ్డి అలియాస్ రాజు కొత్లాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
ప్రస్తుతం ఆమె తల్లిగారి ఇంటి వద్ద ఉండటంతో రాజు కూడా ప్రతిరోజూ కొత్లాబాద్ నుంచి బైక్‌పై మహబూబ్ నగర్ కు వచ్చి పెయింటింగ్ పని చేసేవాడు. ఈ క్రమంలో దినసరి కూలీగా పని చేసే అమ్మాయిని రాజు చాలా సార్లు బైక్ మీద ఎక్కించుకుని రావడంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 5న ఆ అమ్మాయి పని కోసం జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట గేటు దగ్గరకు వచ్చింది. ఆ రోజు పని దొరకకపోవడంతో రాజు అతని స్నేహితుడు, ఆంజనేయులు కలిసి ఆమె వద్దకు వెళ్లారు.
వేరే చోట పని ఇప్పిస్తామని చెప్పి bike మీద ఎక్కించుకుని ఫతేపూర్ అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ ఆమెకు బలవంతంగా మద్యం తాగించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. రాజు rape చేసేటప్పుడు ఆంజనేయులు ఫొటోలు, వీడియోలు తీశాడు. విషయం చెబితే చంపేస్తామని బెదిరించారు. కాగా ఈ నెల 18న ఆ అమ్మాయికి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారు ఆ marriageని చెడగొట్టాలని లైంగిక దాడి photos, videos సదరు పెళ్లి కొడుకు whatsappకు పంపారు.