గది అద్దె భారమైపోతుందని ఓఎల్ఎక్స్ లో ప్రకటన ఇచ్చాడో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆ తరువాత తెలిసిన విషయాలు అతడిని తీవ్ర ఇబ్బందుల్లో పడేశాయి.
హైదరాబాద్ : రూమ్ షేరింగ్ కోసం ప్రకటన ఇచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి షాకింగ్ ఘటన ఎదురైంది. అతనితోపాటు రూమ్ షేర్ చేసుకోవడానికి తనకి ఇష్టమైన అంటూ గదిలో చేరిన ఓ యువతి.. సహజీవనం పేరుతో కొంతకాలం గడిపింది. ఆ తర్వాత తాను ప్రాస్టిట్యూట్ అన్న విషయాన్ని తెలియజేసింది. దీంతో కంగుతిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆమెను గది ఖాళీ చేసి వెళ్ళమనడంతో సమస్య మొదలయ్యింది. బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దాడులు చేయించింది. వెంటనే అతను పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ యూసుఫ్ కూడా మధురా నగర్ ఠాణా పరిధిలో సహజీవనం పేరుతో ఓ మహిళ మోసం చేసిందని ఓ కేసు నమోదయింది. పి కిరణ్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి వెంగళరావు నగర్ కృష్ణ నగర్ లో ఉండేవాడు. అతను అక్కడ ఓ గదిని అద్దెకి తీసుకున్నాడు. తాను ఒక్కడికే గది అద్దె ఎక్కువైపోతుండడంతో తనతో పాటు రూమ్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగలవారు కావాలని ఓఎల్ఎక్స్ లో ప్రకటన ఇచ్చాడు.
గులాబీ నేత గుండెల్లో గుబులు పుట్టిస్తున్న చపాతీ కర్ర, రోడ్డు రోలర్..
ఆ ప్రకటన చూసిన ఓ మహిళ తనకు గది అవసరం ఉందంటూ అతడిని సంప్రదించి అతనితోపాటు రూమ్ షేర్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరూ తమ మకాం కూకట్పల్లికి మార్చారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె తాను వేశ్య అన్న సంగతి చెప్పింది. దీంతో కిరణ్ వెంటనే ఆమెను రూమ్ ఖాళీ చేసి వెళ్లాలని కోరాడు. అప్పటికే వీరిద్దరి మధ్య సంబంధం కూడా ఏర్పడింది. రూమ్ ఖాళీ చేయమనడంతో ఆ మహిళ.. దానికి అంగీకరించలేదు.. పైగా తామిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగింది.
అంతటితో ఊరుకోకుండా కిరణ్ తన మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీస్ స్టేషన్ కి ఎక్కింది. సైబరాబాద్ షీ టీమ్స్ ను ఆశ్రయించింది. పోలీసులు ఆమె చెప్పిన వాదనను నమ్మారు. ఆ మహిళకు, కిరణ్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. రూ.4.7లక్షల పరిహారం ఆమెకు కిరణ్ తో ఇప్పించారు. ఇంత జరిగినా ఆమె శాంతించలేదు. తామిద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసింది.
దీనితో కిరణ్ వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించగా.. వారి జోక్యంతో ఆ ఫోటోలను తీసేసింది. తనమీద సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడన్న కక్షతో నవంబర్ 13వ తేదీన ఇద్దరు వ్యక్తులతో రాత్రి తొమ్మిది గంటల సమయంలో దాడి చేయించింది. దాడి అనంతరం బాధితులను పోలీసులను ఆశ్రయించడంతో ఆమె మీద కేసు నమోదు చేశారు.