#DishaAccusedEncounter: నిందితుల అంత్యక్రియలకు కొత్త చిక్కు

Siva Kodati |  
Published : Dec 06, 2019, 06:02 PM IST
#DishaAccusedEncounter: నిందితుల అంత్యక్రియలకు కొత్త చిక్కు

సారాంశం

దిశ నిందితుల అంత్యక్రియలను రాత్రి లోగా నిర్వహించాలని భావిస్తున్న పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది

దిశ నిందితుల అంత్యక్రియలను రాత్రి లోగా నిర్వహించాలని భావిస్తున్న పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. నారాయణ్‌పేట్ జిల్లా గుడిగండ్లకు చెందిన నిందితులు మహ్మద్ పాషా, నవీన్, శివ, చెన్నకేశవుల అంత్యక్రియలను స్వగ్రామంలో నిర్వహించేందుకు గాను పోలీసులు వ్యవసాయ పొలంలో గుంతలు తీశారు.

Also Read:తెలంగాణలో సంచలనం రేపిన ఎన్ కౌంటర్లు ఇవే: హీరో సజ్జనార్

ఈ విషయం తెలుసుకున్న ఆ భూమి యజమానులు తమ పట్టా భూముల్లో అంత్యక్రియలు ఏంటని అడ్డుకున్నారు. గుడిగండ్లలో స్మశానం లేదు.. గ్రామ శివార్లలోని సర్వే నెం 12కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలోనే మరణించిన వారిని ఖననం చేసేవారు.  

Also Read:న్యాయం చేశారు: తెలంగాణ పోలీసులకు రివార్డ్ ప్రకటించిన వ్యాపారవేత్త

ఈ విషయంపై పోలీసులకు అవగాహన లేకపోవడంతో ప్రోక్లెయిన్‌లతో తవ్వకాలు జరిపారు. భూ యజమానులు దీనిపై అభ్యంతరం తెలపడంతో పోలీసులు మరో చోట ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిందితుల్లో ఏ-1 మహ్మాద్ ఆరిఫ్ స్వగ్రామం జక్లేర్, మిగిలిన ముగ్గురు నిందితులు చెన్నకేశవులు, శివ, నవీన్‌లు గుడిగండ్ల గ్రామానికి చెందినవారే.

Also Read:దిశను బూతులు తిడుతూ... నిందితుడి బంధువు షాకింగ్ కామెంట్స్

మరోవైపు ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి నిందితుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా గుడిగండ్ల, జక్లేర్ గ్రామాలకు మృతదేహాలను తరలించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?