కనువిప్పు కలగాలి, ఇంతటితో వదలొద్దు: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై పవన్

Published : Dec 06, 2019, 03:43 PM ISTUpdated : Dec 06, 2019, 03:52 PM IST
కనువిప్పు కలగాలి, ఇంతటితో వదలొద్దు: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై పవన్

సారాంశం

దిశ సంఘటన ముగిసిందని దీనిని మనం ఇంతటితో వదిలి పెట్టకూడదన్నారు. మరే ఆడబిడ్డకు ఇటువంటి పరిస్థితి రాకూడదు. నిర్భయ ఉదంతం తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంట్ తీసుకువచ్చిందన్నారు. అయినా అత్యాచారారాలు ఆగడం లేదన్నారు పవన్ కళ్యాణ్.  

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ కనువిప్పు కావాలని సూచించారు. 

దిశ ఉదంతం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోందన్నారు. ఆ కరాళ రాత్రివేళ నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని చూసిందో తలచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతుంది. జాతి యావత్తు తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం ఈ ఆవేదనేనని తెలిపారు. 

దిశ సంఘటన ముగిసిందని దీనిని మనం ఇంతటితో వదిలిపెట్టకూడదన్నారు. మరే ఆడబిడ్డకు ఇటువంటి పరిస్థితి రాకూడదు. నిర్భయ ఉదంతం తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంట్ తీసుకువచ్చిందన్నారు. అయినా అత్యాచారారాలు ఆగడం లేదన్నారు పవన్ కళ్యాణ్.  

అంటే అంటే ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని జరుగుతున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నట్లు తెలిపారు. ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠినాతి కఠినమైన చట్టాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు పవన్ కళ్యాణ్. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్: పంచనామా పూర్తి, ఘటనా స్థలానికి నిందితుల తల్లిదండ్రులు

ఇతరదేశాలలో ఎటువంటి చట్టాలు ఉన్నాయో అధ్యయనం  చేయాలన్నారు. మేధావులు ముందుకు కదలాలన్న పవన్ కళ్యాణ్ వారి ఆలోచన శక్తితో ఇటువంటి నికృష్ట ఘాతుకాలకు చరమాంకం పాడాలని కోరారు. 

ఇలాంటి కేసులలో కోర్టు పరంగా తక్షణ న్యాయం లభించాలని పవన్ వ్యాఖ్యానించారు. రెండు మూడు వారాలలోనే శిక్షలు పడేలా నిబంధనలు తీసుకు రావాలన్నారు. ఆడపడుచుల శ్రేయస్సు దృష్ట్యా శిక్షలు బహిరంగంగా అమలు చేయడానికి యోచన జరగాలని సూచించారు. 

నేర స్థాయిని బట్టి అది మరణ శిక్ష అయినా, మరే ఇతర శిక్ష అయినా సరే బహిరంగంగా అమలు జరపాలి అని పవన్ కోరారు. ప్రజలు కోరుకున్న విధంగా దిశ ఉదంతంతో సత్వర న్యాయం లంభించిందన్నారు. దిశ ఆత్మకు శాంతి కలగాలని ఈ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. 

Justice For Disha:ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్ వివరణ ఇదీ
 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే