Priyanka Reddy case: నా కొడుకును చంపేయండి.. నిందితుడి తల్లి అభ్యర్ధన

Published : Nov 30, 2019, 11:54 AM ISTUpdated : Nov 30, 2019, 12:09 PM IST
Priyanka Reddy case: నా కొడుకును చంపేయండి.. నిందితుడి తల్లి అభ్యర్ధన

సారాంశం

ప్రియాంకరెడ్డిని ఎలా అయితే అత్యంత దారుణంగా హత్య చేశారో అలాగే తనకొడుకును కూడా చేయాలని నిందితుడు చెన్నకేశవులు తల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన కొడుకుని ఉరేసినా పర్వాలేదని ఆమె స్పష్టం చేశారు. తనకు చెన్నకేశవులుతోపాటు ఆడపిల్లలు కూడా ఉన్నారని ఆమె తెలిపారు. 

హైదరాబాద్: వైద్యురాలు ప్రియాంకరెడ్డిని ఎలా అయితే హత్య చేశారో అలాగే తన కుమారుడిని కూడా చంపేయాలని డిమాండ్ చేశారు నిందితుడు చింతకుంట చెన్నకేశవులు తల్లి. ప్రియాంకరెడ్డిని ఎలా అయితే అత్యంత దారుణంగా హత్య చేశారో అలాగే తనకొడుకును కూడా చేయాలని నిందితుడు చెన్నకేశవులు తల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

తన కొడుకుని ఉరేసినా పర్వాలేదని ఆమె స్పష్టం చేశారు. తనకు చెన్నకేశవులుతోపాటు ఆడపిల్లలు కూడా ఉన్నారని ఆమె తెలిపారు.  ప్రియాంకరెడ్డికి జరిగినట్లు మరే ఇతర ఆడబిడ్డకు జరగకూడదని ఆమె అన్నారు. 

ప్రియాంకరెడ్డి హత్యకేసుపై కిషన్ రెడ్డి రిక్వస్ట్: బార్ అసోషియేషన్ కీలక నిర్ణయం

భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే తన కొడుకును ప్రియాంకరెడ్డిని చంపినట్లే చంపాలని డిమాడ్ చేశారు. లేదా ఉరేయ్యండి అంటూ ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు ఇకపై చోటు చేసుకోకుండా ఉండాలంటే ఉరే సరైన శిక్ష అని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. 

ఇకపోతే బుధవారం సాయంత్రం ప్రియాంకరెడ్డిని నలుగురు నిందితులు అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. తొడుపల్లి దగ్గర ప్రియాంకరెడ్డి స్కూటీ పార్క్ చేయడం చూసిన లారీ డ్రైవర్ మహ్మాద్ పాషా ఉద్దేశపూర్వకంగా ఆమె స్కూటీ పంక్చర్ అయ్యిందని కుట్ర పన్నారు. 

కేసులో ఏ3గా ఉన్న జొల్లు నవీన్ స్కూటీ బ్యాక్ టైర్ లో గాలి తీసేశారు. గచ్చిబౌలి నుంచి ప్రియాంక తొండుపల్లి వద్దకు రాగానే బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని నమ్మించారు. పంక్చర్ వేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసింది. పంక్చర్ వేయిస్తామని తీసుకెళ్లిన వారు గాలి కొట్టించి తిరిగి ఇచ్చేశారు.

వాళ్లకి ఉరిశిక్ష పడాలి... ఏ లాయర్ వాదించొద్దు: ప్రియాంక తండ్రి శ్రీధర్ రెడ్డి

అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అత్యాచార సమయంలో యువతి కేకలు వేయడంతో నోరు మూయడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. అనంతరం చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర కిరోసిన్ పోసి నిప్పంటించి తగుటబెట్టారు. 

ఇకపోతే హత్య కేసులో డ్రైవర్‌ ఏ1మహ్మద్ పాషా, ఏ2 క్లీనర్‌ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్‌ (23), ఏ4 క్లీనర్‌ చెన్న కేశవులు (లారీ డ్రైవర్‌)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు స్పష్టటం చేశారు. తెలిపారు. వైద్యురాలి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్‌ తెలిపారు. నిందితులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 

Priyanka Reddy Murder Case: కొడుకు దుర్మార్గంపై నిందితుడి తల్లి ఏమన్నారంటే

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu