అది నేరమైతే.. నన్ను కూడా శిక్షించండి.. ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు

By team teluguFirst Published Oct 21, 2021, 5:25 PM IST
Highlights

తనతో ఫొటోలు దిగిన  మహిళా  పోలీసులపై చర్యలు తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్  ముఖ్యమంత్రి యోగి  ఆదిత్యానాథ్ యోచిస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు  ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra)  ఆరోపించారు.

తనతో ఫొటోలు దిగిన  మహిళా  పోలీసులపై చర్యలు తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్  ముఖ్యమంత్రి యోగి  ఆదిత్యానాథ్ యోచిస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు  ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra)  ఆరోపించారు. ఈ ఫొటోలు  చూసి Yogi Adityanath  ఎంతగానో  బాధపడినట్టుగా వార్తలు వస్తున్నాయని అన్నారు. తనతో  ఫొటోలు  దిగడం  నేరమైతే  ఆ శిక్షను తాను  అనుభవిస్తానని  చెప్పారు. కష్టపడి  పనిచేసే  మహిళా పోలీసుల కెరీర్‌ను  ఇబ్బందుల్లోకి నెట్టడం  ప్రభుత్వానికి సరికాదని  అన్నారు. అసలేం జరిగిందంటే.. పోలీసుల కస్టడీలో ఉండగా  మరణించిన  వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం ప్రియాంక గాంధీ ఆగ్రాకు  బయలుదేరారు.  అయితే ఆమె వాహనాన్ని  పోలీసులు లక్నో ఆగ్రా ఎక్స్‌ప్రెస్  వేపై అడ్డగించారు. అనంతరం ఆమెను  అదుపులోకి తీసుకన్నారు.

ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త  పరిస్థితులు  చోటుచేసుకున్నాయి. పోలీసులు ఆమెను  అదుపులోకి తీసుకోవడంపై ప్రియాంక గాందీ స్పందించారు. నేను ఇళ్లు, ఆఫీస్ కాకుండా మరెక్కడికి వెళ్లాలని చూసిన  ఈ తమాషా  మొదలుపెడతారని మండిపడ్డారు. ఆమె  కారును  అడ్డుకున్న క్రమంలోనే కొందరు కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం  చోటుచేసుకుంది. 

అయితే  ఆ సమయంలో అక్కడున్న కొందరు మహిళా పోలీసులు ప్రియాంక  గాంధీతో ఫొటోలు తీసుకున్నారు. మహిళా పోలీసులు ప్రియాంక గాంధీతో సెల్పీలు  దిగిన  ఫొటోలు  సోషల్  మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే  వాటికి సంబంధించి ఫొటోలు దిగిన మహిళా పోలీసులపై యోగి సర్కార్ చర్యలు  తీసుకోవాలని చూస్తుందని  ప్రియాంక ఆరోపించారు. తనతో ఫొటోలు దిగడం నేరమైతే తనపై చర్యలు తీసుకోవాలని ప్రియాంక అన్నారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేగానీ  కష్టపడి, నమ్మకంగా  పనిచేసే  పోలీసుల కెరీర్‌ను  పాడుచేయడం  ప్రభుత్వానికి  తగదని  అన్నారు. 

Also read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం..

కొందరు మహిళా పోలీసులు ప్రియాంక గాంధీతో ఫొటోలు దిగిన వ్యవహారంపై విచారణ  సాగుతున్నట్టుగా లక్నోలోని ఓ పోలీసుల ఉన్నతాధికారి చెప్పారు. మహిళా పోలీసులు.. సర్వీసు  నిబంధనలు  ఏమైనా ఉల్లంఘించారో  లేదో పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు. 

click me!