హుజురాబాద్‌: అన్ని పథకాలు అమలౌతున్నాయి.. దళితబంధునే ఆపారు, ఈసీ నిర్ణయంపై హైకోర్టులో పిల్

By Siva KodatiFirst Published Oct 21, 2021, 5:09 PM IST
Highlights

హుజురాబాద్‌లో (huzurabad bypoll) దళిత బంధు (dalitha bandhu)ను ఈసీ నిలిపివేసిన సంగతి  తెలిసిందే. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్యయ్య (mallepally lakshmaiah) హైకోర్టులో (telangana high court) పిటిషన్ దాఖలు చేశారు. దళిత బంధు ఆపాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని లక్ష్యయ్య తన పిటిషన్‌లో కోరారు.

ఉపఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (election code of conduct) అనుసరించి కేంద్ర ఎన్నికల సంఘం (election commission of india) హుజురాబాద్‌లో (huzurabad bypoll) దళిత బంధు (dalitha bandhu) నిలిపివేసిన సంగతి  తెలిసిందే. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్యయ్య (mallepally lakshmaiah) హైకోర్టులో (telangana high court) పిటిషన్ దాఖలు చేశారు. దళిత బంధు ఆపాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని లక్ష్యయ్య తన పిటిషన్‌లో కోరారు. దళిత బంధు కాకుండా హుజురాబాద్‌లో అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దళిత బంధును మాత్రమే ఆపడంపై ఈసీ ఆదేశాలను సవాల్ చేశారు లక్ష్మయ్య. దళిత బంధు పథకాన్ని యథావిధిగా అమలయ్యేలా చూడాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. 

మరోవైపు దళిత బంధు విషయంలో ఈసీ ఆదేశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దళిత బంధుపై ఈసీ తన పరిధిని అతిక్రమించిందని ఆయన వ్యాఖ్యానించారు.. ఎన్నికల కమిషన్‌.. ఎన్ని రోజులు ఆపగలదు సీఎం ప్రశ్నించారు. దళిత బంధు అర్హులు ఆందోళన చెందవద్దని సూచించిన కేసీఆర్.. రెండో తేదీ నుంచే దళిత బంధు తిరిగి ప్రారంభం అవుతుందని హామీ ఇచ్చారు. ఇక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.

ALso Read:దళిత బంధు కొనసాగుతుంది.. ఏది మొదలుపెట్టినా సాధించి చూపించాం: సీఎం కేసీఆర్

కాగా.. హుజురాబాద్‌లో ఎన్నిక ముగిసేవరకు దళిత బంధును నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారగా వేడెక్కాయి. ఇందుకు మీరంటే మీరని రాష్ట్రంలో అధికారంలో వున్న TRS, కేంద్రంలో అధికారంలో వున్న BJP ఆరోపించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బిజెపి ఉపాధ్యక్షులు విజయ రామారావు కీలక వ్యాఖ్యలు చేసారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ పద్మనాభ రెడ్డితో దళిత బంధుపై పిర్యాదు చేయించింది టీఆర్ఎస్ పార్టీయే అంటూ vijaya ramarao సంచలన వ్యాఖ్యలు చేసారు. 

'ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి దళిత బంధు అమలు చేసే పరిస్థితిలో వుంది. కానీ హుజురాబాద్ ఉపఎన్నికలో తన పార్టీ టీఆర్ఎస్‌ను గెలిపించుకోవాలంటే దళితుల ఓట్లు కావాలి. అందుకోసమే దళిత బంధును తానే ప్రారంభించి తిరిగి తానే ఆగిపోయేలా చేసారు. కేసీఆర్ దళిత బంధు అపిస్తాడని రాష్ట్రంలోని అన్ని పార్టీలకు తెలుసు'' అని విజయ రామారావు ఆరోపించారు.

click me!