తెలంగాణలో ప్రియాంక గాంధీ పాదయాత్ర.. ? వారం నుంచి పది రోజుల పాటు కొనసాగే అవకాశం..

By Asianet NewsFirst Published May 24, 2023, 1:09 PM IST
Highlights

తెలంగాణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాదయాత్ర చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పాదయాత్ర వారం నుంచి పది రోజుల పాటు కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమెతో ఇప్పటికే చర్చలు జరిపారు. 

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని, అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీని కోసం ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తోంది. గెలుపును నిర్ణయించే ఏ అవకాశాన్ని వదిలిపెట్టకూడదని భావిస్తోంది. దీని కోసం అవసరమైతే జాతీయ నాయకులను తీసుకొచ్చి రాష్ట్రంలో ఇప్పటి నుంచి ప్రచారం నిర్వహించాలని చూస్తోంది. అయితే ముందుగా ప్రియాంక గాంధీని తెలంగాణకు రప్పించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

వంట మనిషి కుమారుడు కలెక్టర్ కాబోతున్నారు.. సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన పేదింటి బిడ్డ రేవయ్య..

ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ భారీ ఎత్తుగడ వేస్తోంది. అధికార బీఆర్ఎస్ కు సవాల్ విసరాలంటే నెహ్రూ-గాంధీ కుటుంబం చరిష్మా అవసరమని భావిస్తోంది. అందుకే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇక్కడ తమ ప్రచారానికి ముఖంగా ఉండాలని అనుకుంటోంది. దీని కోసం ఆమె తరచూ రాష్ట్రంలో పర్యటించేలా, మరిన్ని బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర అగ్రనాయకులు ఆమెతో ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ చేసే ప్రకటనలు, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేలా సోనియాగాంధీ కుమార్తె చూసుకుంటారనే సందేశాన్ని రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రియాంక గాంధీని రాష్ట్ర ప్రజలతో మమేకం చేయాలంటే ఆమెతో ఇక్కడ వారం నుంచి పది రోజుల పాటు పాదయాత్ర చేయించాలని ప్రతిపాదించారని తెలుస్తోంది. కాగా.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రియాంక గాంధీ ప్రజలను కోరతారని, తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఇచ్చిన హామీలకు ఆమె కట్టుబడి ఉంటారని ఏఐసీసీ నేత ఒకరు తెలిపారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. 

దారుణం.. ఫారెస్టు గార్డును కాల్చి చంపిన వేటగాళ్లు.. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో ఘటన

కేసీఆర్ ను సవాలు చేయడానికి ప్రియాంక గాంధీ లాంటి బలమైన ముఖం అవసరమని కాంగ్రెస్ లో చాలా మంది భావిస్తున్నట్లు సమాచారం. యువతకు, రైతులకు సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చినంత మాత్రాన వారి ఓట్లను రాబట్టుకోలేమని, తెలుగు ఓటర్లు కేవలం పార్టీ సిద్ధాంతాలు, పథకాలకే పరిమితం కాకుండా బలమైన నాయకుల వైపు ఆకర్షితులవుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. 1983లో టీడీపీ అధికారంలోకి రావడానికి నటుడు, రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు చేసిన వ్యక్తిగత కృషిని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అలాగే 1989లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ విజయం సాధించిందని, తరువాత 1999 ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా కృషి చేశారని చెబుతున్నారు.

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు చేయగా లేనిది.. ఇప్పుడు మోడీ చేస్తే తప్పా - కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి

ఆ తర్వాత కాంగ్రెస్ ను ముందుండి నడిపించి 2004, 2009లో అధికారంలోకి తెచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాగా.. 2014లో కొత్త రాష్ట్రంలో బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చి, 2018లో మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి కేసీఆర్ బలంగా నిలబడ్డారు. అలాగే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన పాదయాత్ర ద్వారా ఏపీలో టీడీపీని అధికారానికి దూరం చేశారు. ఈ పరిణామాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ తెలంగాణలో ఓటర్ల ముందు బలమైన వాదన వినిపించేందుకు ఒక వ్యక్తి అవసరం అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే ప్రియాంక గాంధీ లాంటి జాతీయ నేతతో ఇక్కడ ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. 

click me!