కన్నవారిని కఠినంగా శిక్షించాలంటూ... పోలీసులను ఆశ్రయించిన బాలుడు

By Arun Kumar PFirst Published May 24, 2023, 12:25 PM IST
Highlights

కన్నవారినే కఠినంగా శిక్షించాలంటూ ఓ పదకొండేళ్ళ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన శంకర్ పల్లి వెలుగుచూసింది. 

శంకర్ పల్లి : అల్లరి చేస్తున్నాడని కన్న కొడుకును మందలించడమే ఆ తల్లిదండ్రులు చేసిన తప్పయ్యింది. తనను కొడుతున్న కన్నవారిని కఠినంగా శిక్షించాలంటూ ఓ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం... నారాయణపేట జిల్లా మద్దూరుకు చెందిన మాల నర్సింలు-లక్ష్మి దంపతులకు ఐదుగురు సంతానం. ఉపాధి నిమిత్తం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో వుంటున్నారు దంపతులు. హనుమాన్ నగర్ కాలనీలో నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నారు నర్సింలు దంపతులు. 

అయితే నర్సింలు-లక్ష్మి దంపతుల 11ఏళ్ళ కొడుకు తల్లిదండ్రులపైనే పోలీసులకు ఫిర్యాదు చేసాడు. తనను ఇష్టం వచ్చినట్లు కొడుతూ తల్లిదండ్రులు నరకం చూపిస్తున్నారంటూ బాలుడు పోలీసులకు తెలిపాడు. తనను కొడుతున్న పేరెంట్స్ ని కఠినంగా శిక్షించాలంటూ శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు అందించాడు.  

Read More  ఆరో తరగతి బాలుడి ఫిర్యాదును స్వయంగా స్వీకరించిన కమిషనర్ డీఎస్ చౌహాన్

బాలుడి ఫిర్యాదుపై స్పందించిన ఎస్సై సంతోష్ రెడ్డి నర్సింలు, లక్ష్మి దంపతులను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి కొడుకును కొడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలున్ని కూడా తల్లిదండ్రులు చెప్పినట్లు వినాలని సూచించి తల్లిదండ్రులతో పంపించారు. 

ఇదిలావుంటే ఏలూరు జిల్లాలోనూ ఇటీవల ఇలాగే ఓ బాలుడు మారుతల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఏలూరు పట్టణంలోని కొత్తపేటలో పదేళ్ల సాయి దినేష్ కన్నతల్లి చనిపోవడంతో కలిసి తండ్రి మరోపెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటివద్దే వుంటున్న దినేష్ స్నేహితుడి భర్త్ డే వుండటంతో బయటకు వెళ్ళాలని అనుకున్నాడు. కానీ అందుకు అంగీకరించని మారుతల్లి వేసుకోడానికి అడిగిన బట్టలు ఇవ్వలేదు. దీంతో చిర్రెత్తిపోయిన బాలుడు ఒంటిపై కేవలం టవల్ తోనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి తల్లిపై ఫిర్యాదు చేసాడు.


 


 


 

click me!