తెలంగాణలో మోడీ టూర్:రూ. 13, 500 కోట్ల పనులకు ప్రధాని శ్రీకారం

By narsimha lode  |  First Published Oct 1, 2023, 3:03 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ రూ. 13, 500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మహబూబ్ నగర్ నుండి  మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


హైద్రాబాద్ నుండి రాయిచూర్, రాయిచూర్ నుండి హైద్రాబాద్ కు తొలి రైలు సర్వీస్ ను ప్రధాని ప్రారంభించారు.  హైద్రాబాద్ యూనివర్శిటీకి ఐదు కొత్త భవనాలను ప్రధాని ప్రారంభించారు. చర్లపల్లికి గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టకు శంకుస్థాపన చేశారు.  రూ. 500 కోట్లతో  37 కి.మీ. నిర్మించిన జక్లేర్-కృష్ణా న్యూ రైల్వే లైన్  ను ప్రధాని జాతికి అంకితం చేశారు.   ఖమ్మం నుండి విజయవాడకు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహాదారి పనులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మోడీ  తన పర్యటనలో  రూ. 6,404 కోట్ల విలువైన జాతీయ రహదారులకు శంకుస్థాపన చేశారు.

అంతకు ముందు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఈ సభలో ప్రసంగించారు.  తెలంగాణకు  అన్ని రకాలుగా  కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. రైతులకు ఎరువులపై సబ్సిడీ రూపంలో కేంద్రం వేల కోట్లు అందిస్తుందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం రూ. 30 వేల కోట్లను కేటాయించిందని ఆయన గుర్తు చేశారు.హైద్రాబాద్ చుట్టూ నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డుతో రాష్ట్రం రూపు రేఖలు మారుతాయని  కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైల్వేలు, హైవేల నిర్మాణంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉందని ఆయన గుర్తు చేశారు.

Latest Videos

undefined

also read:తెలంగాణలో మోడీ టూర్: ఏడో దఫా కేసీఆర్ దూరం

ప్రధాన మంత్రి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తే  కేసీఆర్ కు మాత్రం సమయం ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటించిన పలు సమయాల్లో  కేసీఆర్ దూరంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు అయితే ఇది రాజకీయ వేదిక కాదన్నారు.ఈ విషయంలో కేసీఆర్ తీరుపై తనకు బాధ ఉందన్నారు.  కేసీఆర్ సర్కార్ కు  తెలంగాణ అభివృద్ధిపై  చిత్తశుద్ది లేదన్నారు.  దేశంలో ఏ రాష్ట్రంలో ఈ రకమైన సీఎం లేడన్నారు. ఈ విషయమై  కేసీఆర్ తీరుపై  రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని  కిషన్ రెడ్డి  ప్రజలను కోరారు. 

 

click me!