ప్రణయ్ హత్యకేసు నిందితులకు 14 రోజుల రిమాండ్

Published : Sep 19, 2018, 05:16 PM ISTUpdated : Sep 19, 2018, 05:40 PM IST
ప్రణయ్ హత్యకేసు నిందితులకు 14 రోజుల రిమాండ్

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హత్యకేసులో ప్రమేయం ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు భారీ బందోబస్తు నడుమ మిర్యాలగూడ కోర్టులో హాజరుపరిచారు. 

నల్గొండ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హత్యకేసులో ప్రమేయం ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు భారీ బందోబస్తు నడుమ మిర్యాలగూడ కోర్టులో హాజరుపరిచారు. కేసుపై విచారణ జరిపిన కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు నిందితులను నల్గొండ జైలుకు తరలించారు. 

మరోవైపు నిందితులను మిర్యాలగూడ కోర్టులో హాజరుపరచునున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

అమృతను కిడ్నాప్ చేసి, ప్రణయ్‌ను చంపాలని స్కెచ్: ఎస్పీ

 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌