ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

Published : Sep 19, 2018, 04:39 PM ISTUpdated : Sep 19, 2018, 05:18 PM IST
ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

సారాంశం

తనకు ఇష్టం లేని వ్యక్తిని కూతురు ప్రేమిందనే కారణంతో కక్ష పెంచుకున్న మాధవి తండ్రి.. ప్రేమికుల పై కత్తితో దాడి చేశాడు.  

మిర్యాలగూడ పరువు హత్య కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్ సంఘటనను ఇంకా ఎవరూ మర్చిపోనేలేదు. అలాంటి సంఘటనే మరోటి హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడి జరిగింది. నవదంపతులను సందీప్, మాధవీలుగా పోలీసులు గుర్తించారు. మాధవి తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తనకు ఇష్టం లేని వ్యక్తిని కూతురు ప్రేమిందనే కారణంతో కక్ష పెంచుకున్న మాధవి తండ్రి.. ప్రేమికుల పై కత్తితో దాడి చేశాడు.

ఈ సంఘటనలో సందీప్, మాధవిలు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడి అనంతరం మాధవి తండ్రి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్