ప్రణయ్ హత్య కేసు: అమృత తండ్రి మారుతీరావుకు బెయిల్ మంజూరు

Published : Dec 24, 2019, 07:44 AM IST
ప్రణయ్ హత్య కేసు: అమృత తండ్రి మారుతీరావుకు బెయిల్ మంజూరు

సారాంశం

ప్రణయ్ హత్య కేసులో నిందితుడు, అతని భార్య అమృత వర్షిణి తండ్రి మారుతీరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనను బెదిరిస్తున్నాడంటూ అమృత చేసిన ఫిర్యాదు మేరకు మారుతీరావును అరెస్టు చేశారు.

మిర్యాలగుడా: మామ చేతిలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వర్షిణి తండ్రి మారుతీరావుకు బెయిల్ మంజూరైంది. నల్లగొండ జిల్లా మిర్యాలగుడాకు చెందిన ప్రణయ్ హత్య కేసులో సాక్షులను బెదిరించాడనే ఆరోపణలపై మారుతీరావు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటూ వచ్చాడు. 

మారుతీరావుకు సోమవారం న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మారుతీరావు ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్నాడు. ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులు అబ్దుల్ కరీం, కందుల వెంకటేశ్వర్లు వేర్వేరుగా రెండో సారి బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. 

Also Read: ప్రణయ్ హత్య కేసు: అమృత ఫిర్యాదు, మరోసారి మారుతీ రావు అరెస్ట్

నిందితులకు మిర్యాలగుడా అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ జగ్ జీవన్ కుమార్ బెయిల్ మంజూరు చేశారు. తనను ప్రలోభపెట్టడానికి, భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ అమృత మారుతీరావుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఆస్తుల పేరుతో తనను ప్రలోభపెట్టడానికి తండ్రి మారుతీ రావు ప్రయత్నిస్తున్నారంటూ అమృత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమృత ఫిర్యాదు మేరకు పోలీసులు మారుతీరావును రెస్టు చేశఆరు. ఈ కేసులో ఆయనతో పాటు కరీం, వెంకటేశ్వర రావులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!