తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నెల 30న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలకానుంది. అలాగే ఈ నెల 31 నుంచి జనవరి 2 వరకు అభ్యంతరాలకు గడువుంది. డిసెంబర్ 31న జిల్లా అధికారులతో రాజకీయ పార్టీలు సమావేశం కానున్నాయి.
జనవరి 1వ తేదీన మున్సిపల్ కమీషనర్ల స్థాయిలో రాజకీయ పార్టీలు భేటీ అవుతాయి. జనవరి 3 నుంచి అభ్యంతరాలను ఈసీ పరిష్కరించనుంది. జనవరి 4న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్:
* జనవరి 7న నోటిఫికేషన్
* జనవరి 8 నుంచి 10 వరకు నామినేషన్లు
* జనవరి 11న నామినేషన్ల పరిశీలన
* జనవరి 12, 13న తిరస్కరణకు గురైన నామినేషన్లకు అప్పీల్ చేసుకునే అవకాశం
* జనవరి 14న నామినేషన్ల ఉపసంహరణకు గడుబు
* జనవరి 22న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్
* జనవరి 25న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
గత నెల 22న విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ప్రభుత్వానికి ట్విస్టిచ్చింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే విధించిన 75 మున్పిపాలిటీల్లో స్టేను వేకేట్ చేయించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
Also Read:తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్: స్టే ఎత్తివేతకు హైకోర్టు సుముఖత
తెలంగాణ రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీలతో పాటు మరో 13 కార్పోరేషన్లు ఉన్నాయి.ఈ కార్పోరేషన్లలో ప్రస్తుతం పాలకవర్గాలు కొనసాగుతున్నాయి.
మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా తయారీని చేపట్టారు. అయితే రిజర్వేషన్ల ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
Also Read:మున్సిపల్ ఎన్నికలు, ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: దానిపై కేసీఆర్ వెనక్కి
మున్సిపాలిటీల్లోని ఓటర్ల జాబితాలో పొరపాట్లు జరిగాయని కూడ హైకోర్టును ఆశ్రయించిన వారు కూడ ఉన్నారు. దీంతో హైకోర్టు ప్రభుత్వంతో పాటు పిటిషనర్ల వాదనలను వింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిచేయాలని, రిజర్వేషన్ల ప్రక్రియలో అవకతవకలను సరిచేయాలని పిటిషనర్లు కోరారు.
అంతేకాదు రిజర్వేషన్లు, వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న పరిణామాల్లో అవకతవకలను సరిచేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో పిటిషనర్లు గట్టిగా వాదించారు