కారణమిదే: దిశ నిందితుల మృతదేహాలకు నేడు అంత్యక్రియలు

By narsimha lode  |  First Published Dec 23, 2019, 6:04 PM IST

దిశ నిందితుల మృతదేహాలకు సోమవారం నాడు రాత్రే అంత్యక్రియలను నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు.



మహాబూబ్‌నగర్:: దిశ నిందితుల  మృతదేహాలకు సోమవారం రాత్రే అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఇప్పటికే 50 శాతం వరకు మృతదేహాలు కుళ్లిపోయాయి. దీంతో ఇవాళ రాత్రికే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్  నిందితుల కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించి వారి నుండి సంతకాలను  తీసుకొన్నారు.

సోమవారం నాడు మద్యాహ్నం రెండున్నర గంటల వరకు దిశ నిందితుల మృతదేహాలకు ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం రీ పోస్టుమార్టం నిర్వహించింది.  రీ పోస్టుమార్టం పూర్తైన తర్వాత  మృతదేహాలను గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్  నిందితుల కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు నాలుగు కుటుంబాల నుండి గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ సంతకాలు తీసుకొన్నారు.

Latest Videos

నిందితుల స్వగ్రామాలకు మృతదేహాలను తరలించేందుకు గాంధీ ఆసుపత్రి నుండి ప్రత్యేకంగా రెండు అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. సామాజిక కార్యకర్త సజయ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది.

ఈ నెల 23వ తేదీ లోపుగా రీ పోస్టుమార్టం చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నిందితులు మృతి చెందిన  ఇవాళ్టికి 17 రోజులు అవుతోంది. దీంతో  మృతదేహాలు  కుళ్లిపోయాయి.

ఎక్కువ కాలం కూడ మృతదేహాలను ఇంటి వద్ద ఉంచుకొనే పరిస్థితి కూడ ఉండదు. దీంతో మృతదేహాలకు ఇవాళ అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు.


 

click me!