
ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అంగీకారం తెలిపినట్లు తెలిసింది.
రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఈ మేరకు ఓయూ అధికారులకు సమాచారం అందింది.
ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకల గురించి పూర్తి వివరాలను తమకు పంపాలని రాష్ట్రపతి కార్యాలయం ఓయూ అధికారులను కోరింది.
వివరాలు అందిన వెంటనే రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ వివరాలను పంపిస్తామని వెల్లడించింది.