
తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు కలసి నడిచిన వారికి సీఎ కేసీఆర్ ప్రభుత్వ పదవులతో సత్కరిస్తున్నారు.
ఇప్పటికే పలువురు ఉద్యమకారులను ఆయనను ఉన్నత పదవుల్లో నియమించారు.
తెలంగాణ ఉద్యమంలో తన రచనల ద్వారా భావజాల వ్యాప్తికి కృషి చేసిన వీరమల్ల ప్రకాశ్ ను ఈ రోజు ప్రభుత్వం రాష్ట్ర వాటర్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్ చైర్మన్ గా నియమించింది. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు.
వరంగల్ జిల్లా ములుగు వెంకటాపూర్ కు చెందిన వి.ప్రకాశ్ తెలంగాణ ప్రకాశ్ గా సుపరిచితులు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత దానికి కొన్నాళ్లు అధికార ప్రతినిధిగా కొనసాగారు.
నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఎంతో కృషి చేశారు.
లాయర్ గా కేరీర్ ఆరంభించినా ఆయనకు సాగునీటి రంగంలో విశేషమైన అవగాహన ఉంది.
అందుకే ఆయనకు జల వనరుల అధ్యయన, అభివృద్ధి సంస్థ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.