వాజ్‌పేయ్ లాంటి నేతలు లేరు, రాష్ట్ర నేతలే ఎదగాలి: ప్రకాష్ అంబేద్కర్

By narsimha lode  |  First Published Apr 14, 2023, 5:05 PM IST

దేశానికి  రెండో రాజధానిగా  హైద్రాబాద్ ను  అంబేద్కర్  సూచించారని  ప్రకాష్  అంబేద్కర్ గుర్తు  చేశారు.  కానీ  అంబేద్కర్   ఆలోచన అమలు  కాలేదన్నారు.  
 



హైదరాబాద్:  సమాజంలో  మార్పు  తెచ్చేందుకు  అంబేద్కర్  భావజాలం  అవసరమని  మాజీ ఎంపీ  అంబేద్కర్ మనమడు  ప్రకాష్ అంబేద్కర్  చెప్పారు.  హైద్రాబాద్  ట్యాంక్ బండ్ పై  125 అడుగుల  అంబేద్కర్ విగ్రహన్ని  ఆవిష్కరించారు. అనంతరం  నిర్వహించిన సభలో  ప్రకాష్ అంబేద్కర్  ప్రసంగించారు. 
సమాజంలో  మార్పు  కోసం  నిత్యం  సంఘర్షణ తప్పదన్నారు. రూపాయి సమస్యపై  అంబేద్కర్ 1923లోనే పరిశోధన పత్రం  రాశారని  ఆయన  గుర్తు  చేశారు. బ్రిటీష్  పాలకులు  ఇండియాను  ఎలా దోచుకుంటున్నారో గ్రహించారన్నారు. 

అంబేద్కర్  భారీ విగ్రహం  ఏర్పాటు  చేసినందుకు  కేసీఆర్  కు ఆయన  శుభాకాంక్షలు తెలిపారు. దేశ  ప్రజలంతా   సంతోషంగా  ఉండాలని అంబేద్కర్  కోరుకున్నారని  ఆయన గుర్తు  చేశారు. అంబేద్కర్ ఆదర్శాలు  పాటించడమే  ఆయనకు  నిజమైన నివాళిగా  ప్రకాష్ అంబేద్కర్  పేర్కొన్నారు. ప్రజలంతా  విద్యావంతులు  కావాలని  అంబేద్కర్  కోరుకున్నారన్నారు.   

Latest Videos

ఆర్ధిక  దుర్భలత్వంపై  పోరాడేందుకు  కేసీఆర్  కృషి  చేస్తున్నారన్నారు. దళితబంధు  పథకం  రూపొందించేందుకు  కేసీఆర్  కు  ప్రకాష్ అంబేద్కర్  ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్  ఆశయాలను కేసీఆర్  ముందుకు తీసుకెళ్తున్నారని  ప్రకాష్అంబేద్కర్  చెప్పారు. 

పొట్టి శ్రీరాములు  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం కోసం త్యాగం  చేశారని ఆయన ఈ సందర్భంగా  గుర్తు  చేశారు.  పొట్టిశ్రీరాములు  ప్రాణత్యాగం  చేసేవరకు ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం ఇవ్వలేదన్నారు.  తెలంగాణ  ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం  కూడా  పెద్ద ఎత్తున పోరాటం  సాగిన విషయాన్ని  ప్రకాష్ అంబేద్కర్ గుర్తు  చేశారు. చిన్న రాష్ట్రాలతోనే  అభివృద్ది  సాధ్యమని  అంబేద్కర్ భావించేవారని  ప్రకాష్ అంబేద్కర్  విరించారు. 

దేశానికి  రక్షణ సమస్య వస్తే మరో రాజధాని అవసరమని  అంబేద్కర్  చెప్పారన్నారు. ఇండియాకు  రెండో  రాజధానిగా  హైద్రాబాద్  సరైందని  అంబేద్కర్ చెప్పిన మాటలను  ప్రకాష్ అంబేద్కర్  ప్రస్తావించారు.  పాకిస్తాన్, చైనా నండి  హైద్రాబాద్  ఎంతో  దూరంలో  ఉంటుందన్నారు.  భారత్ కు  హైద్రాబాద్  రెండో రాజధానిగా  ఉండాలన్న  అంబేద్కర్   ఆశయం  నెరవేరలేదని  ప్రకాష్ అంబేద్కర్  తెలిపారు.

also read:ప్రగతి భవన్ ‌కు ప్రకాష్ అంబేద్కర్: కేసీఆర్‌తో లంచ్ మీటింగ్

ప్రస్తుతం  దేశంలో  జాతీయ  నాయకులు  కన్పించడం లేదని  ప్రకాష్ అంబేద్కర  ఆవేదన వ్యక్తం  చేశారు. వాజ్ పేయ్  వంటి  జాతీయ  నాయకులు  కన్పించడం లేదన్నారు.  అభివృద్దిలో  తెలంగాణ  దేశానికి  కొత్త దారి  చూపించిందన్నారు.రాష్ట్ర నేతలే  జాతీయ నేతలుగా  ఎదగాలన్నారు.    జాతి,  ధర్మాలకు  అతీతంగా  రాజకీయాలు  ఉండాలని  కోరుకుంటున్నట్టుగా  ఆయన  చెప్పారు. అంబేద్కర్  ఆశయాలు కేవలం  దళితులు,  ఆదీవాసీలకే  పరిమితం కాదన్నారు.  
 

click me!