దళితులను మోసం చేశారు.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: బండి సంజ‌య్

By Mahesh Rajamoni  |  First Published Apr 14, 2023, 4:57 PM IST

Hyderabad: హైదరాబాద్ లో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఏర్పాటుపై  తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తినందుకే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటైంద‌ని అన్నారు. అలాగే, ద‌ళితుల‌ను కేసీఆర్ మోసం చేశార‌నీ, దీనికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. 
 


Telangana BJP chief Bandi Sanjay Kumar: దళితులకు ద్రోహం చేసిన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) దళితులకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ శుక్రవారం డిమాండ్ చేశారు. దళితుడిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీని నెరవేర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామన్న హామీని కూడా కేసీఆర్ వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో దళితుల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని సంజయ్ ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, ఇన్నాళ్లూ అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని తిరగరాయమని చెప్పి బాబాసాహెబ్‌ను కేసీఆర్ అవమానించలేదా? అని ప్ర‌శ్నించారు. 

Latest Videos

దళితుల ఆర్థిక స్వావలంబనపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్య, వైద్యాన్ని పేదలకు ఎందుకు దూరం చేస్తుందో చెప్పాలన్నారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనపై బండి సంజ‌య్ మాట్లాడుతూ.. బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తినందున మాత్రమే విగ్రహం ఏర్పాటైంద‌ని అన్నారు. కేసీఆర్ కేవలం సచివాలయంపైనే దృష్టి సారించి విగ్రహ నిర్మాణ పనులను నిలిపివేశారని ఆరోపించారు.

కేసీఆర్ దళిత వ్యతిరేకి అని పేర్కొన్న బండి సంజయ్, గతంలో అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనకుండా అంబేద్కర్‌ను అవమానించారని, భారత రాజ్యాంగాన్ని మళ్లీ రాయాలని డిమాండ్ చేశారని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే హక్కు కేసీఆర్‌కు లేదంటూ వ్యాఖ్యానించారు.

click me!