ప్రభాస్‌- వైఎస్ షర్మిలపై రాతలు: ఆ పది 10 వెబ్‌సైట్లపై చర్యలు

By sivanagaprasad kodatiFirst Published Jan 17, 2019, 12:48 PM IST
Highlights

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె... వైఎస్ షర్మిల, ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌లపై అసభ్యకరమైన వార్తలు రాస్తున్న 10 వెబ్‌సైట్లను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ప్రభాస్‌కు తనకు ముడిపెడుతూ కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ షర్మిల కొద్దిరోజుల క్రితం హైదారాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. 

దానితో పాటు గూగుల్, యూట్యూబ్‌కు ఆమె ప్రత్యేకంగా లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ సైబర్ క్రైం విభాగం దర్యాప్తు చేపట్టింది.. ఈ దర్యాప్తులో యూట్యూబ్, ఫేస్‌బుక్‌తో పాటు మొత్తం 10 వెబ్‌సైట్లను గుర్తించినట్లు సైబర్ క్రైం డీసీపీ తెలిపారు.

ఈ కేసును రాజకీయ, వ్యక్తిగత కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, 2 వారాల్లో నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పోస్టులు పెట్టిన వారితో పాటు అందుకు ప్రొత్సహించిన వారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

షర్మిల ఫిర్యాదు: యూట్యూబ్, గూగుల్‌లకు లేఖ

షర్మిలకు బాబు కౌంటర్: నమ్మకపోతే పోటీ ఎందుకు

click me!