నాకు కేసీఆర్ తో అవసరం ఉంది.. జగ్గారెడ్డి

Published : Jan 17, 2019, 12:48 PM IST
నాకు కేసీఆర్ తో అవసరం ఉంది.. జగ్గారెడ్డి

సారాంశం

తనతో తెలంగాణ సీఎం కేసీఆర్ కి అవసరం లేకపోయినా.. తనకు మాత్రం ఆయనతో అవసరం ఉందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.  

తనతో తెలంగాణ సీఎం కేసీఆర్ కి అవసరం లేకపోయినా.. తనకు మాత్రం ఆయనతో అవసరం ఉందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.  తన నియోజకవర్గ ప్రజల కోసమైనా తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలుస్తానని ఆయన చెప్పారు. తన అవసరం కేసీఆర్ కి లేదని.. కాకపోతే తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్య మంత్రి అవసరం తనకు ఉందని చెప్పారు.

అపాయింట్ ఇచ్చే వరకు వెయిట్ చేసి మరీ.. ఆయనను కలుస్తానని చెప్పారు. తన నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వస్తే.. ఆయనకు సన్మానం చేస్తానని చెప్పారు. ఒకవేళ రాకుంటే.. సైలెంట్ గా ఉంటానని తెలిపారు. సీఎం కేసీఆర్ పై అనవరస వ్యాఖ్యలు చేయవద్దని తాను తన పార్టీ నేతలకు సూచించానని జగ్గారెడ్డి చెప్పారు. ప్రజలు తీర్పు ఇచ్చాక కామెంట్ చేయడం సరికాదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?