సమస్యల పరిష్కారం కోసం విద్యుత్‌ ఉద్యోగుల మహా ధర్నా.. ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Published : Mar 24, 2023, 03:16 PM ISTUpdated : Mar 24, 2023, 03:34 PM IST
సమస్యల పరిష్కారం కోసం విద్యుత్‌ ఉద్యోగుల మహా ధర్నా.. ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

సారాంశం

Hyderabad: పీఆర్సీ సహా ఇతర సమస్యల పరిష్కారం కోసం విద్యుత్‌ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో ఖైరతాబాద్-పంజాగుట్ట రహదారి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి రావాల్సిన వేతన సవరణను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు.. త‌మ‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాడ‌తామ‌ని నినదించారు.  

Power staff protests for PRC: పీఆర్సీ కోసం విద్యుత్‌ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో ఖైరతాబాద్-పంజాగుట్ట రహదారి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి రావాల్సిన వేతన సవరణను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు.. త‌మ‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాడ‌తామ‌ని నినదించారు.

వివ‌రాల్లోకెళ్తే.. తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లను పరిష్కారించ‌డంతో పాటు పీఆర్సీని డిమాండ్ చేస్తూ విద్యుత్‌ ఉద్యోగులు ఖైరతాబాద్‌లోని విద్యుత్‌ సౌధా వద్ద మహాధర్నా చేపట్టారు. ధర్నాకు వివిధ జిల్లాల నుంచి భారీగా ఉద్యోగులు తరలివచ్చారు. దీంతో పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ధ‌ర్నాకు దిగారు. పీఆర్సీ అంశం, ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నిన‌దించారు. విద్యుత్ ఉద్యోగుల‌ మహా ధర్నా నేప‌థ్యంలో విద్యుత్‌ సౌధా పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్ప‌డి.. ఖైరతాబాద్‌-పంజాగుట్ట రహదారిపై భారీగా సంఖ్య‌లో వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ధ‌ర్నాను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

వేతన సవరణతోపాటు ఆర్టిజన్‌ ​​కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఖైరతాబాద్‌లోని విద్యుత్‌ సౌధ దగ్గర ఉద్యోగులు పెద్దఎత్తున ధర్నా చేపట్టడంతో జంక్షన్‌ పూర్తిగా ట్రాఫిక్ తో నిలిచిపోయింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి చెల్లించాల్సిన వేతన సవరణను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు ధ‌ర్నాకు దిగారు. అయితే, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.

అంత‌కుముందు, గురువారం జరిగే చలో విద్యుత్‌ సౌధ కార్యక్రమాన్ని గ్రాండ్‌ సక్సెస్‌ చేసేందుకు విద్యుత్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్లాన్‌ చేసింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వారి సమావేశాల అనంతరం నిరసన ఖరారు చేశారు. యూనియన్ నాయకులు డిస్కమ్‌ల ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌లతో వ‌రుస పరస్పర చర్చలు జరిపారు. అయితే, ఇంధన శాఖ మంత్రి జీ.జగదీశ్‌రెడ్డి గైర్హాజరీతో జేఏసీ, యాజమాన్యం మధ్య జరిగిన చర్చలు కొలిక్కిరాలేదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!