శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

Published : Apr 27, 2019, 05:57 PM ISTUpdated : Apr 27, 2019, 06:03 PM IST
శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

సారాంశం

శ్రావణి శరీరం లోపల, ఎడమ వైపు ఆరు ఎముకలు విరిగిపోయయని తెలిపారు. అలాగే శరీరం కుడివైపు కమిలినట్లు ఉందన్నారు. చాతిభాగం, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు స్పష్టం చేశారు. పోస్ట్ మార్టం చేస్తున్న వైద్యులకు శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోయినప్పటికీ ఎముకలు విరిగిపోయాయని, ఊపిరి ఆడకుండా ఊపిరితిత్తులు, చాతి భాగం పూర్తిగా దెబ్బతిన్నాయని పోస్ట్ మార్టం చేసిన వైద్యులు తెలిపారు. 

యాదాద్రి: దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన శ్రావణి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తైనట్లు భువనగిరి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ కొట్యానాయక్ స్పష్టం చేశారు. పోస్టుమార్టం చేస్తున్నప్పుడు శరీరంపై పెద్దగా గాయాలు లేనప్పటికీ ఊపిరి ఆడకుండా హత్య చేసినట్లు తెలుస్తోందని వైద్యులు స్పష్టం చేశారు. 

శ్రావణి శరీరం లోపల, ఎడమ వైపు ఆరు ఎముకలు విరిగిపోయయని తెలిపారు. అలాగే శరీరం కుడివైపు కమిలినట్లు ఉందన్నారు. చాతిభాగం, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు స్పష్టం చేశారు. 

పోస్ట్ మార్టం చేస్తున్న వైద్యులకు శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోయినప్పటికీ ఎముకలు విరిగిపోయాయని, ఊపిరి ఆడకుండా ఊపిరితిత్తులు, చాతి భాగం పూర్తిగా దెబ్బతిన్నాయని పోస్ట్ మార్టం చేసిన వైద్యులు తెలిపారు. 

నివేదికలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఎముకలు విరిగిపోవడం, ఊపిరితిత్తులు, ఛాతిభాగం పూర్తిగా దెబ్బతినడంతో యువతిని దుండగులు దారుణంగా హత్య చేసి ఉంటారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

శ్రావణి హత్య కేసు: బొమ్మల రామారం ఎస్ఐపై వేటు

తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం: హజీజ్ పురాలో ఉద్రిక్తత

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో ఈ ప్రాంతంలో కొత్త‌గా లాజిస్టిక్ హ‌బ్స్‌.. భారీగా పెర‌గ‌నున్న భూముల ధ‌ర‌లు, ఉద్యోగాలు
Liquor sales: మాములు తాగుడు కాదు సామీ ఇది.. డిసెంబ‌ర్ 31న‌ ఎన్ని కోట్ల బీర్లు, విస్కీ తాగారంటే